పోటీదారులను ఎదగనీయకుండా చేస్తున్న గూగుల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ
ఈ వార్తాకథనం ఏంటి
సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు చాలామంది వినియోగదారులు గూగుల్‌ని ఉపయోగిస్తున్నారు.
అయితే ప్రస్తుతం అమెరికాలో.. గూగుల్ కి అమెరికా ప్రభుత్వానికి మధ్య యాంటీట్రస్ట్ విచారణ జరుగుతుంది.
ఈ విచారణలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన వాదనను వినిపించారు. గూగుల్ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రత్యర్థి కంపెనీలు నిలబడలేక పోతున్నాయని ఆయన అన్నారు.
ఆపిల్ ఇంకా ఇతర మొబైల్ కంపెనీలతో గూగుల్ ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుంటుందని, అందువల్ల ప్రత్యర్థి కంపెనీలు ఎదగలేక పోతున్నాయని సత్య నాదెళ్ల చెప్పుకొచ్చారు.
Details
ఎదగలేకపోతున్న బింగ్ సెర్చ్ ఇంజిన్
2009 నుండి మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్ తన మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుందని, కానీ గూగుల్ చేసుకుంటున్న ఒప్పందాల కారణంగా బింగ్ సెర్చ్ ఇంజిన్, పోటీ పడలేకపోతుందని నాదెల్ల అన్నారు.
యాంటీ ట్రస్ట్ కేసు అంటే ఏమిటి?
యూజర్లు తమ మొబైల్ డివైజులను ఓపెన్ చేసినప్పుడు మొదటిసారిగా గూగుల్ సెర్చ్ ఇంజన్ కనిపించేలా, దాన్ని డిఫాల్ట్ గా ఉంచేలా ఆపిల్, వెరిజోన్ వంటి కంపెనీలకు గూగుల్ చెల్లింపులు చేసిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది.
డిఫాల్ట్ గా గూగుల్ సెర్చ్ ఇంజన్ ని ప్రమోట్ చేయడం వల్ల ఇతర కంపెనీలు వెనకబడి పోతున్నాయని వాదన.