Page Loader
ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు
HoloLens, Surface, Xboxలో కోతలు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్

ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 11, 2023
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్‌ తో పాటు Xbox గేమింగ్ డివిజన్‌ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది. కంపెనీ సిబ్బందిలో దాదాపు 5% మందిని తగ్గించే ప్రణాళిక మార్చి 31 వరకు కొనసాగుతుంది. మహమ్మారి అనంతర ఆర్థిక మందగమనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలను ప్రభావితం చేసింది. ఆల్ఫాబెట్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్‌తో సహా టెక్ ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకోకపోతే తన ఆదాయ వృద్ధి నెమ్మదిస్తుందని మైక్రోసాఫ్ట్ అంచనా వేసి, ఈ తొలగింపులు మొదలుపెట్టింది. HoloLens హార్డ్‌వేర్ సిబ్బందిని తగ్గించాలనే నిర్ణయం, HoloLens 3 రాకపై ప్రశ్నలు లేవనెత్తింది.

మైక్రోసాఫ్ట్

ఉద్యోగ కోతలు వల్ల Xbox గేమింగ్ మార్కెటింగ్ ప్రభావితం అయింది

Xboxలో, ఉద్యోగ కోతలు వల్ల Xbox గేమింగ్ మార్కెటింగ్ ప్రభావితం అయింది. Xbox చీఫ్ ఫిల్ స్పెన్సర్ ఉద్యోగాల కోత గురించి తెలియజేయడానికి ఉద్యోగులకు ఇమెయిల్ పంపారు. అయితే వ్యాపారంలో ఏయే భాగాలపై ప్రభావం పడిందో ఆయన ప్రస్తావించలేదు. మైక్రోసాఫ్ట్ వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ వెంచర్‌లను కూడా ప్రభావితం చేశాయి. కంపెనీ 2017లో మొదలుపెట్టిన సామాజిక VR ప్లాట్‌ఫారమ్ AltspaceVRని మూసివేయాలని గతనెలలో నిర్ణయించుకుంది. మార్చి 10, 2023న ప్లాట్‌ఫారమ్ poortiపూర్తిగా మూసేస్తున్నారు. జనవరిలో, క్రాస్-ప్లాట్‌ఫారమ్ మిక్స్డ్ రియాలిటీ డెవలప్‌మెంట్‌కు కీలకమైన మిక్స్‌డ్ రియాలిటీ టూల్‌కిట్ టీమ్‌ను కూడా మైక్రో సాఫ్ట్ తొలగించింది.