
microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌లో మరోమారు భారీ లేఆఫ్స్.. సుమారు 9 వేల ఉద్యోగులకు నోటీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వేల మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. గత కొన్ని నెలల వ్యవధిలో ఇది రెండోసారి లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం. అయితే ఈసారి ఎంతమంది ఉద్యోగులు పని కోల్పోతారన్న విషయాన్ని సంస్థ స్పష్టంగా వెల్లడించనప్పటికీ.. ఇది మొత్తం ఉద్యోగులలో నాలుగు శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. మీడియా నివేదికల ప్రకారం, తాజా విడతలో దాదాపు 9,000 మంది ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 2.28 లక్షలు
జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 2.28 లక్షలు. ఇదివరకు మే 2024లో సంస్థ 6,000 మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు మైక్రోసాఫ్ట్ అడుగులు వేసింది. తాజా నిర్ణయం మేరకు మొత్తం సిబ్బంది సంఖ్యలో సుమారు నాలుగు శాతం మంది అంటే దాదాపు 9,100 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడే అవకాశముందని అంచనా .