Stock Market: మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు.. నిఫ్టీ 75 పాయింట్లు జంప్, సెన్సెక్స్ డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ స్వల్ప నష్టాల్లో ముగియగా.. నిఫ్టీ లాభాల్లో స్థిరపడింది. సెన్సెక్స్ 19.63 పాయింట్లు లేదా 0.026 శాతం నష్టపోయి 74,294.96 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 75.80 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 23,346.40 వద్ద నిలిచింది.
వివరాలు
టాప్ గెయినర్స్.. లూజర్స్
ఇక శుక్రవారం ట్రేడింగ్‌లో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్, వెల్స్‌పన్ కార్ప్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
అదే సమయంలో గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
మొత్తంగా చూస్తే.. వారాంతపు చివరి ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ స్వల్ప నష్టాన్ని నమోదు చేయగా, నిఫ్టీ మాత్రం లాభాల్లో ముగియడంతో దేశీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చవిచూశాయి.