Page Loader
Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ పై నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది నవంబర్ 1న జరుగుతుందని స్పష్టం చేసింది. దీంతో నవంబర్ 1, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ముహురత్ ట్రేడింగ్ 2024 జరుగనుంది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బీఎస్‌ఈ) ఈ అంశంపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే వారు కూడా నవంబర్ 1న ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ సెషన్ దీపావళి సందర్భంగా ప్రారంభమయ్యే హిందూ క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించింది.

Details

ఈ సెషన్ ద్వారా ఏడాది పొడవునా ప్రయోజనాలు

'ముహురత్' అంటే శుభ సమయం, ఇందులో ట్రేడింగ్ చేయడం ద్వారా ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆర్థిక వృద్ధి, శ్రేయస్సు పొందుతారనే నమ్మకం ఉంది. సాధారణంగా, పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉంటాయి. అయితే దీపావళి సందర్భంగా ముహురత్ ట్రేడింగ్ కోసం సాయంత్రం గంట పాటు ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తారు. నవంబర్ 1న సాయంత్రం 5.45 నుంచి 6.00 గంటల వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్ జరుగుతుంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొత్త వెంచర్లను ప్రారంభించేందుకు అనువైన సమయంగా భావిస్తారు. ఈ సెషన్ ద్వారా వారు ఏడాది పొడవునా ప్రయోజనాలను పొందుతారని భావిస్తారు.

Details

ట్రేడింగ్ లో ఓ గంటపాటు అస్థిరంగా మార్కెట్లు

కేవలం ఒక గంట ట్రేడింగ్‌తో మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి. కాబట్టి లాభ-నష్టం విషయాలపై పెద్దగా ఆలోచించరు. గత 17 ప్రత్యేక సెషన్లలో 13 సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగియడం, ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులను అందించాయి. ఇక 2008లో, సెన్సెక్స్ ఒక గంట సెషన్‌లో 5.86 శాతం పెరగడం విశేషం. భారతదేశంలో, దీపావళి సమయంలో స్టాక్ బ్రోకర్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా భావిస్తారు. ఈ సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలు చేయడం ద్వారా రాబోయే సంవత్సరానికి శ్రేయస్సు తీసుకురావాలని చూస్తారు.