విలాసవంతమైన ఫ్లాట్ ను అమ్ముకున్న ముకేశ్ అంబానీ.. ధర ఎంతో తెలుసా
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీకి భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ లగ్జరీ హోమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాటిల్లోని ఓ విలాసవంతమైన విల్లాను విక్రయించి వార్తల్లో నిలిచారు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ లోని లగ్జరీ ఇల్లును అమ్మేసినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రకటించింది. మాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగో ఫ్లోర్ లో అంబానికి ఓ ఫ్లాట్ ఉంది. సుమారు 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ లగ్జరీ ఇంటిని 9 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ఇంటిని సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరి అని అంటారు. భారత కరెన్సీ ప్రకారం దీని ధర రూ.74.53 కోట్లుగా నిర్థారించారు.
కిటికీల్లో నుంచి తొంగి చూస్తే కనువిందు చేయనున్న హడ్సన్ నదీ అందాలు
1919 నాటి ఈ విల్లాలో 10 అడుగుల ఎత్తులో సీలింగ్స్, హెరింగ్ బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్స్ తో నిర్మించారు. వెలుపలి నుంచి ఏ శబ్ధం కూడా ఇంటి లోపలికి రాకపోవడం ఈ ఫ్లాట్ స్పెషాలిటీ. అత్యాధునికతను జోడించి సకల సౌకర్యాలు కల్పించిన ఈ ఇంటి నుంచి హడ్సన్ నదీ అందాలు కనువిందు చేస్తాయి. ఇక ఇంటిలోని ఇంటీరియర్ డెకరేషన్ అమోఘంగా నిలిచింది. 3 పడక గదులు, 3 స్మిమ్మింగ్ రూమ్స్, పిల్లలు ఆడుకునేందుకు ఆటగది, యోగా గది, విశాలమైన సూపర్బ్ లాంజ్, వాలెట్ పార్కింగ్ లాంటి మోడర్న్ సౌకర్యాలు ఉన్నాయి. మార్క్ షటిల్ వర్త్, లెస్లీ అలెగ్జాండర్, మార్క్ జాకబ్స్ లాంటి ప్రముఖులు ఈ అపార్ట్ మెంట్ లో నివాసం ఉన్నారు.