Mumbai : భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
Mercer 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ప్రవాసులకు భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై తన టైటిల్‌ను కొనసాగిస్తోంది. 2013లో సర్వే ప్రారంభించినప్పటి నుంచి ముంబై ఈ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ స్థాయిలో, ముంబై గత సంవత్సరం కంటే 11 స్థానాలు ఎగబాకి, ఇప్పుడు సర్వే చేసిన 226 నగరాల్లో 136వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 అత్యంత ఖరీదైన నగరాలు హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్, న్యూయార్క్ సిటీ, లండన్, నసావు , లాస్ ఏంజిల్స్.
ఇతర భారతీయ నగరాలు కూడా ఉన్నత స్థానంలో ఉన్నాయి
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 200 నగరాల్లో ఇతర భారతీయ నగరాలు కూడా ఉన్నాయని సర్వే వెల్లడించింది. వీటిలో న్యూఢిల్లీ (ర్యాంక్ 164), చెన్నై (189), బెంగళూరు (195) ఉన్నాయి. అదే సమయంలో, హైదరాబాద్ 202 ర్యాంక్‌లో స్థిరంగా ఉండగా, పూణే 205 ర్యాంక్‌కు ఎగబాకింది. కోల్‌కతా కూడా ర్యాంకింగ్‌లో 207కి పెరిగింది. ఆసియాలో ముంబై , ఢిల్లీ రెండూ తమ ర్యాంకింగ్స్‌లో వృద్ధిని సాధించాయి.
భారతీయ నగరాల్లో ఇళ్ల అద్దెలు పెరిగాయి
బెంగళూరులో అద్దెలు 3-6% పెరగ్గా, పూణె, హైదరాబాద్ , చెన్నైలలో 2-4% పెరుగుదల కనిపించింది. ఢిల్లీలో అత్యధికంగా 12-15%, ముంబైలో అద్దెలు 6-8% పెరిగాయి. వాణిజ్య రాజధానిలో ఉపాధి పెరుగుదల, పెరుగుతున్న మధ్యతరగతి వలసల వల్ల ఈ పెరుగుదల సాధ్యమైందని మెర్సెర్‌లో ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మచెప్పారు. ఇందుకు ఉపాధి అవకాశాలు పెరుగుదల కారణమైందని పేర్కొన్నారు.
ఇంధనం,వినిమయ ఖర్చులలో ముందంజలో ముంబై, పూణే
సర్వే అనేక ఇతర జీవన వ్యయాలను కూడా విశ్లేషించింది. ఇంధనం , వినియోగ ఖర్చుల పరంగా ముంబై ,పూణే అత్యంత ఖరీదైన భారతీయ నగరాలు అని పేర్కొంది. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు మరియు నిర్వహణ ఖర్చులతో సహా రవాణా ఖర్చులు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. బెంగళూరు తర్వాతి స్థానంలో ఉంది. ఆల్కహాల్ , పొగాకు వస్తువులు ఢిల్లీలో అత్యల్పంగా చెన్నైలో అత్యంత ఖరీదైనవి. ఇక్కడ ఖర్చు ఒక సంవత్సరంలో 20% పెరిగింది.