LOADING...
Elon Musk: మస్క్‌ AI సంస్థలో మరో రాజీనామా.. CFO లిబరటోర్ నిష్క్రమణ
మస్క్‌ AI సంస్థలో మరో రాజీనామా.. CFO లిబరటోర్ నిష్క్రమణ

Elon Musk: మస్క్‌ AI సంస్థలో మరో రాజీనామా.. CFO లిబరటోర్ నిష్క్రమణ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI నుంచి వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) మైక్ లిబరటోర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టగా, కేవలం మూడు నెలల్లోనే జూలైలో బయటకు వెళ్లడం గమనార్హం. ఇంతకుముందు ఆయన Airbnbలో పనిచేశారు.

కంటిబ్యూషన్స్ 

లిబరటోర్ పదవీకాలంలో కీలక నిర్ణయాలు

తన పదవిలో ఉన్న కొద్ది నెలల్లోనే లిబరటోర్, సంస్థ తరఫున 5 బిలియన్ డాలర్ల రుణం, అలాగే 5 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఫండ్ రైజ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. వీటిలో దాదాపు సగం పెట్టుబడిని SpaceX సమకూర్చింది. అదేవిధంగా, మెంఫిస్‌లోని డేటా సెంటర్ విస్తరణ ప్రాజెక్టులను కూడా ఆయన పర్యవేక్షించారు. అయితే, గత నెలలో కంపెనీ జనరల్ కౌన్సిల్ రాబర్ట్ కీల్ రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన కూడా బయటకు రావడం చర్చనీయాంశమైంది.

నిష్క్రమణలు 

వరుసగా ఉన్నతాధికారుల నిష్క్రమణ

ఇదివరకే కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఇగోర్ బబుష్కిన్, AI భద్రతా పరిశోధనపై దృష్టి సారిస్తూ స్వంత వెంచర్ క్యాపిటల్ సంస్థ ప్రారంభించేందుకు xAI నుంచి తప్పుకున్నారు. అంతేకాదు, మరో సీనియర్ లాయర్ రఘు రావు కూడా ఇదే సమయంలో కంపెనీని వీడారు. అలాగే, X మాజీ CEO లిండా యాక్కారినో కూడా జూలైలో రాజీనామా చేశారు. దీనికి కారణం xAI రూపొందించిన చాట్‌బాట్ Grok చూపించిన అనూహ్య ప్రవర్తనేనని అప్పట్లో సమాచారం వెలువడింది.