Loading...
Elon Musk: అమెరికాలో ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. మస్క్ ప్రకటన
అమెరికాలో ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. మస్క్ ప్రకటన

Elon Musk: అమెరికాలో ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. మస్క్ ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌-X సీఈఓ ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో ప్రకటించారు. ఇందులో ఒక షేర్‌ను స్పేస్‌ఎక్స్ సంస్థ తరఫున, మరో షేర్‌ను తాను వ్యక్తిగతంగా అందించనున్నట్లు స్పష్టం చేశారు. స్పేస్‌ఎక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్రతి 'ట్రంప్ అకౌంట్‌'కు కంపెనీ ఒక క్లాస్ ఏ కామన్ స్టాక్ షేర్‌ను కేటాయించనుంది. దీనికి అదనంగా ఎలాన్ మస్క్ తన వ్యక్తిగత వాటా నుంచి మరో షేర్‌ను అందిస్తారు.

వివరాలు 

'ట్రంప్ అకౌంట్ల'లో ఉన్న చిన్నారులకు ఈ షేర్ల కేటాయింపు

అయితే మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్లకు కూడా ట్రంప్ అకౌంట్ల నిబంధనలు వర్తిస్తాయా? వాటిపై నిర్దిష్ట కాలం పాటు విక్రయించకుండా ఉండే లాకప్ పీరియడ్ నిబంధనలు ఉంటాయా? అనే విషయాలపై స్పేస్‌ఎక్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

వాస్తవానికి గత నెలలోనే మస్క్ ఇలాంటి ప్రకటన చేశారు. వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి చిన్నారికి తన స్పేస్‌ఎక్స్ షేర్లలో ఒకటి ఇవ్వనున్నట్లు అప్పట్లో వెల్లడించారు.

అంతకుముందు అక్టోబర్‌లో స్పేస్‌ఎక్స్ అధ్యక్షురాలు గ్విన్ షాట్‌వెల్, ఆమె భర్త కూడా ట్రంప్ కార్యక్రమంలో భాగంగా 20 లక్షలకు పైగా చిన్నారులకు తమ స్పేస్‌ఎక్స్ షేర్లను అందిస్తామని హామీ ఇచ్చారు.

వివరాలు 

భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు వాటా ఇవ్వడమే లక్ష్యమన్న ఎలాన్ మస్క్

తాజా ప్రకటనలో మస్క్ తన ఆలోచనను మరోసారి స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఏర్పడే ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు కూడా వాటా ఉండేలా నేరుగా షేర్లను అందించడమే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు.

ఈ విధానం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయవచ్చని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మస్క్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT