LOADING...
Musk vs Altman: మస్క్ vs ఆల్ట్‌మన్: కోర్టుకెక్కిన AI పోరు
మస్క్ vs ఆల్ట్‌మన్: కోర్టుకెక్కిన AI పోరు

Musk vs Altman: మస్క్ vs ఆల్ట్‌మన్: కోర్టుకెక్కిన AI పోరు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ మధ్య హైప్రొఫైల్ లీగల్ పోరు కోర్టులో మొదలుకాబోతోంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కోర్టులో జడ్జి ఇవోన్ గొంజాలెజ్ రోజర్స్ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరగనుంది. ఒకప్పుడు OpenAI ను కలిసి ప్రారంభించిన వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు పెద్ద లీగల్ ఫైట్‌గా మారాయి. ఇది OpenAI భవిష్యత్తుతో పాటు మొత్తం AI రంగంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. మస్క్ ఆరోపణల ప్రకారం, ప్రారంభ దశలో తాను సుమారు 38 మిలియన్ డాలర్లు పెట్టిన OpenAI తన అసలు లక్ష్యాన్ని వదిలేసి లాభాల దిశగా వెళ్లిందని చెప్పారు.

వివరాలు 

134 బిలియన్ డాలర్ల వరకు పరిహారం కోరుతున్న మస్క్

తనతో పాటు ఇతర మద్దతుదారులను మోసం చేశారని ఆరోపిస్తూ, 134 బిలియన్ డాలర్ల వరకు పరిహారం కోరుతున్నట్టు మస్క్ తెలిపారు. అయితే ఆ మొత్తాన్ని OpenAI నాన్-ప్రాఫిట్ విభాగానికి ఇవ్వాలని చెప్పారు. అలాగే ఆల్ట్‌మన్‌తో పాటు ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ ను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే OpenAI ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. మస్క్ గతంలోనే సంస్థను ప్రాఫిట్ మోడల్‌లోకి మార్చాలని మద్దతు ఇచ్చారని, Tesla తో విలీనం చేసే ఆలోచన కూడా చేశారని చెబుతోంది. అతను ఇచ్చిన డబ్బు పెట్టుబడి కాదని, డొనేషన్ మాత్రమేనని స్పష్టం చేసింది. అలాగే తన ప్రత్యర్థి సంస్థ xAI ప్రయోజనాల కోసం ఈ కేసు వాడుతున్నారని ఆరోపిస్తోంది.

వివరాలు 

2018లో మస్క్ సంస్థ నుంచి ఎందుకు బయటకు వెళ్లారు ? 

ఈ కేసు కీలక సమయంలో రావడం గమనార్హం. ప్రస్తుతం OpenAI విలువ సుమారు 852 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. త్వరలోనే పబ్లిక్‌గా మార్కెట్‌లోకి రావాలని సంస్థ యోచిస్తోంది. ఈ సమయంలో సంస్థ నిర్మాణం లేదా నాయకత్వంలో మార్పులు వస్తే ఆ ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన Microsoft కూడా ఈ కేసు ఫలితంపై దృష్టి పెట్టింది. ఈ ట్రయల్‌లో OpenAI ప్రారంభ దశలో జరిగిన ఈమెయిల్స్, మెసేజెస్, విభేదాలపై మళ్లీ చర్చ జరుగుతుంది. 2018లో మస్క్ సంస్థ నుంచి బయటకు వెళ్లడానికి కారణాలూ వెలుగులోకి రావొచ్చు.

Advertisement

వివరాలు 

రెండు దశల్లో కేసు

ఈ కేసులో మస్క్, ఆల్ట్‌మన్‌తో పాటు Satya Nadella, Ilya Sutskever వంటి ప్రముఖులు సాక్ష్యాలు ఇవ్వనున్నారు. కేసు రెండు దశల్లో సాగనుంది. మొదట మస్క్ ఆరోపణలు చెల్లుబాటు అవుతాయా అన్నది, తరువాత కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం ఉంటుంది. మొత్తానికి,ఈ కేసు కేవలం వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదు. AI రంగంలో ప్రజల ప్రయోజనాలు, భారీ పెట్టుబడుల మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్న పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. OpenAI తన ప్రాఫిట్ మోడల్ అవసరమని చెబుతుంటే, మస్క్ మాత్రం అది అసలు లక్ష్యాన్ని దెబ్బతీసిందని అంటున్నారు. ఫలితం ఎలా ఉన్నా, ఈ కేసు AI రంగంలో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement