
SIP V/s Lump Sum? : మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్: SIPనా? Lump Sumనా?.. ఏది బెస్ట్ ఆప్షన్?
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే సిప్ (Systematic Investment Plan) ద్వారా పెట్టాలా? లేక లంప్‌సమ్ (Lumpsum)గా పెట్టాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. రెండు కూడా సంపదను సృష్టించగలవే కానీ, రిస్క్ మాత్రం వేరుగా ఉంటుంది. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. నెలకు రూ.10వేల సిప్ స్టాక్ మార్కెట్ రిటర్నులు లెక్కించేటప్పుడు సాధారణంగా ఇండెక్స్ ఫండ్‌ని ప్రామాణికంగా తీసుకుంటారు. హిస్టరీ ప్రకారం దీర్ఘకాలంలో ఇండెక్స్ ఫండ్లు సగటున 12% రిటర్నులు ఇచ్చాయి. ఈ లెక్కన మీరు నెలకు రూ.10,000 సిప్ చేస్తే, రూ.1 కోటి సంపాదించేందుకు 21 ఏళ్లు పడుతుంది. మొత్తం పెట్టుబడి-రూ.25,20,000 రాబడి-రూ.79,10,067 మొత్తం విలువ - రూ.1,04,30,067
Details
రూ.10 లక్షల లంప్‌సమ్
సిప్‌లో ఉండే ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకోవడం. అంటే రిస్క్ తగ్గుతుంది. వేతన జీవులకు, ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టలేని వారికి సిప్ చాలా ఉత్తమమైన మార్గం. మొత్తం పెట్టుబడి - రూ.10,00,000 రాబడి - రూ.98,03,848 మొత్తం విలువ - రూ.1,08,03,848 అయితే లంప్‌సమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో టైమింగ్ చాలా కీలకం! మార్కెట్ పీక్‌లో ఉన్నప్పుడు లేదా బేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. మార్కెట్‌ను సరిగ్గా టైమ్ చేయడం సులభం కాదు. రిస్క్ తీసుకునే వారికే ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
Details
సిప్ వర్సెస్ లంప్‌సమ్ - ఏది బెస్ట్?
మీరు గమనిస్తే.. రెండు విధానాల్లోనూ రూ.1 కోటి చేరుకునే సమయం ఒకటే. అందుకే నిర్ణయం మీపైనే ఆధారపడి ఉంటుంది. ఫిక్స్‌డ్ ఆదాయం ఉన్నవారికి → సిప్ బెస్ట్ ఆప్షన్ చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నవారికి → లంప్‌సమ్ సరైన మార్గం ముఖ్యమైన విషయం - త్వరగా ప్రారంభించండి! స్టాక్ మార్కెట్‌లో ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్టెడ్‌గా ఉంటే, అంత ఎక్కువ రాబడులు వస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది.