New Mutual Fund Offers: మ్యూచువల్ ఫండ్స్‌లో 3 కొత్త NFOలు.. నేటి నుంచే సబ్‌స్క్రిప్షన్ షురూ
ఈ వార్తాకథనం ఏంటి
మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త స్కీమ్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లకు ఈ వారం మూడు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో మూడు న్యూ ఫండ్ ఆఫర్లు (NFOs) సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMCs) తమ ప్రొడక్ట్ బాస్కెట్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫండ్స్‌ను తీసుకొస్తుంటాయి. వాల్యూ రీసెర్చ్ సమాచారం ప్రకారం.. ఈ వారం మూడు కొత్త ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మూడూ పాసివ్ ఫండ్ కేటగిరీకి చెందినవే కావడం ప్రత్యేకత. వీటిలో రెండు ఇండెక్స్ ఫండ్స్ కాగా.. మరోటి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF). ఈ మూడు NFOలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాలు
యూటీఐ నుంచి రెండు కొత్త NFOలు
ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రెండు కొత్త ఫండ్ ఆఫర్లు మార్కెట్లోకి వస్తున్నాయి.
యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్(UTI BSE India Sector Leaders Index Fund)NFO సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 31న ప్రారంభమవుతుంది.
ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 11 వరకు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడిని రూ.1,000గా నిర్ణయించారు. మరోవైపు.. యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఈటీఎఫ్ (UTI BSE India Sector Leaders ETF) కూడా ఆగస్టు 31 నుంచే సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వస్తుంది.
ఈ NFO సెప్టెంబర్ 11న ముగుస్తుంది.ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000గా ఉంది.
వివరాలు
నావీ నుంచి మరో ఇండెక్స్ ఫండ్
కనీస మొత్తంతో ప్రారంభించిన తర్వాత అదనంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
నావీ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ కూడా కొత్త స్కీమ్‌ను తీసుకొస్తోంది.
నావీ నిఫ్టీ ఆర్ఈఐటీఎస్ అండ్ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ (Navi Nifty REITs And Realty Index Fund) NFO సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 1న ప్రారంభమవుతుంది.
ఈ ప్రక్రియ సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కనీసం రూ.100తో ప్రారంభించవచ్చు.
అంటే తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్ NFOలో ప్రవేశించే అవకాశం ఈ స్కీమ్‌లో ఉంది.
వివరాలు
పెట్టుబడికి ముందు జాగ్రత్త అవసరం
కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ప్రారంభించే వారు NFOల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు.
NFO కొత్తగా ప్రారంభమయ్యే స్కీమ్ మాత్రమే తప్ప.. అది తప్పనిసరిగా మెరుగైన పెట్టుబడి అవకాశమని భావించకూడదు.
ఫండ్ లక్ష్యం, ఇండెక్స్, రిస్క్, ఖర్చులు, పెట్టుబడి విధానం వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.
డిస్క్లెయిమర్: ఈ కథనం ఇన్వెస్టర్లకు సమాచారం అందించేందుకు మాత్రమే. ఎలాంటి పెట్టుబడిని ప్రోత్సహించడం లేదా సూచించడం దీని ఉద్దేశం కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి అడుగుపెట్టేవారు NFOల్లో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత స్కీమ్ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు.