NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / UltraTech: అల్ట్రాటెక్ సిమెంట్ మెజారిటీ వాటా కొనుగోలు తర్వాత.. ఇండియా సిమెంట్స్ సీఈఓ పదవికి ఎన్ శ్రీనివాసన్ రాజీనామా  
    తదుపరి వార్తా కథనం
    UltraTech: అల్ట్రాటెక్ సిమెంట్ మెజారిటీ వాటా కొనుగోలు తర్వాత.. ఇండియా సిమెంట్స్ సీఈఓ పదవికి ఎన్ శ్రీనివాసన్ రాజీనామా  
    ఇండియా సిమెంట్స్ సీఈఓ పదవికి ఎన్ శ్రీనివాసన్ రాజీనామా

    UltraTech: అల్ట్రాటెక్ సిమెంట్ మెజారిటీ వాటా కొనుగోలు తర్వాత.. ఇండియా సిమెంట్స్ సీఈఓ పదవికి ఎన్ శ్రీనివాసన్ రాజీనామా  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    09:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్ట్రాటెక్ సిమెంట్‌ కంపెనీ, ఇటీవల ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల వద్దున్న 32.72 శాతం వాటాను సొంతం చేసుకుంది.

    దీనితో, ఇండియా సిమెంట్స్‌ ప్రమోటర్లు ఎన్. శ్రీనివాసన్‌ సహా ఇతరులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు.

    ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌లో 10.13 కోట్ల షేర్లను (32.72 శాతం వాటా) కొనుగోలు చేసి ప్రధాన ప్రమోటర్‌గా అవతరించింది.

    ఐసీఎల్‌లో ఇప్పటికే 22.77 శాతం వాటా కలిగిన అల్ట్రాటెక్‌ ఇప్పుడు 55.49 శాతానికి (17.19 కోట్ల షేర్లు) తన వాటాను పెంచుకుంది.

    వివరాలు 

    కొత్త డైరెక్టర్లు 

    ఇండియా సిమెంట్స్‌ బోర్డులో కొత్తగా కేసీ జన్వర్, వివేక్ అగర్వాల్, ఈఆర్ రాజ్ నారాయణన్, అశోక్ రామచంద్రన్‌ డైరెక్టర్లుగా నియమించబడ్డారు.

    అలాగే స్వతంత్ర డైరెక్టర్లుగా అల్కా భరూచా, వికాస్ బాలియా, సుకన్య క్రిపాలు ఎంపికయ్యారు.

    ఐసీఎల్‌ ప్రమోటర్ల వాటాను కొనుగోలు చేసేందుకు రూ. 7,000 కోట్ల విలువైన డీల్‌ కోసం కాంపిటీషన్‌ కమిషన్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

    అల్ట్రాటెక్‌ ఈ ఒప్పందంతో పాటు ఓపెన్ ఆఫర్‌ ద్వారా మరొక 26 శాతం వాటాను సొంతం చేసుకునే అనుమతిని కూడా పొందింది.

    వివరాలు 

    ముఖ్య పరిణామాలు 

    ఈ ఏడాది జూలై 28న, అల్ట్రాటెక్‌ ఇండియా సిమెంట్స్‌లో ప్రమోటర్ల వాటాను రూ. 3,954 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

    నిబంధనల ప్రకారం, ఐసీఎల్‌ ఇతర వాటాదారుల నుండి 26 శాతం వాటా కొనుగోలు చేయడానికి రూ. 3,142 కోట్ల విలువైన ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది.

    గత జూన్‌ నాటికి, ఐసీఎల్‌లో 23 శాతం వాటా పొందిన అల్ట్రాటెక్‌, ఈ ఏడాది మార్చిలో దమానీ గ్రూప్‌ నుంచి వాటాలను కొనుగోలు చేయడంలో రూ. 1,900 కోట్లు వెచ్చించింది.

    వివరాలు 

    కన్సాలిడేషన్‌ ప్రాధాన్యత 

    భారతదేశ సిమెంట్‌ రంగం ప్రస్తుతం కన్సాలిడేషన్‌ దిశగా సాగుతోంది. ఈ రంగంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌, అదానీ గ్రూప్‌ ప్రధాన పోటీలో ఉన్నాయి.

    అల్ట్రాటెక్‌ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2026-27 నాటికి 200 ఎంటీపీఏకి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోగా, అదానీ గ్రూప్‌ 2027-28 నాటికి 140 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలతో ఉంది.

    ఇతర మార్పులు

    అల్ట్రాటెక్‌ అనుబంధ సంస్థగా మారిన ఐసీఎల్‌లో వైస్ చైర్మన్‌, ఎండీ పదవులకు ఎన్. శ్రీనివాసన్‌ రాజీనామా చేశారు.

    ఆయనతో పాటు చిత్రా శ్రీనివాసన్‌, రూపా గురునాథ్‌, వీఎం మోహన్‌ తదితరులు బోర్డు నుంచి తప్పుకున్నారు.

    స్వతంత్ర డైరెక్టర్లు ఎస్‌.బాలసుబ్రమణ్యన్‌, కృష్ణ శ్రీవాస్తవ తదితరులు కూడా రాజీనామా చేశారు.

    వివరాలు 

    అదానీ గ్రూప్‌ ప్రణాళికలు 

    అల్ట్రాటెక్‌ ప్రస్తుత సామర్థ్యం 156.66 ఎంటీపీఏ కాగా, అదానీ గ్రూప్‌ సంఘీ ఇండస్ట్రీస్‌, పెన్నా ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకుని, సీకే బిర్లా గ్రూప్‌ ఓరియంట్‌ సిమెంట్‌ను కొనుగోలు చేస్తోంది.

    అదానీ గ్రూప్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో 100 ఎంటీపీఏ సామర్థ్యాన్ని చేరుకోనుంది.

    అల్ట్రాటెక్‌ కూడా కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ సిమెంట్‌ బిజినెస్‌ కొనుగోలుపై దృష్టి పెట్టి, అవసరమైన నియంత్రణ అనుమతుల కోసం ఎదురు చూస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి  ఇజ్రాయెల్
    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌ నీతి ఆయోగ్
    Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌! డొనాల్డ్ ట్రంప్

    వ్యాపారం

    Muhurat trading : దీపావళి సందర్బంగా ముహురత్ ట్రేడింగ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది దీపావళి
    Hyundai IPO: హ్యుందాయ్‌ మోటార్స్‌ షేర్లు 1% నష్టంతో లిస్ట్ అయినట్లే! హ్యుందాయ్
    Money: వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?.. ప్రధాని ముద్రా యోజన ద్వారా రూ.10 లక్షలు పొందండి ఇలా.. బిజినెస్
    Reliance: రిలయన్స్-డిస్నీ డీల్‌కు సీసీఐ ఆమోదం.. కీలక షరతులు విధింపు రిలయెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025