
Narayanan Vaghul: ఐసీఐసీఐ బ్యాంకు వ్యవస్ధాపక చైర్మన్ నారాయణ్ వాఘల్ ఇక లేరు
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీఐసీఐ బ్యాంకు వ్యవస్ధాపక చైర్మన్ నారాయణ్ వాఘల్ (88) ఏళ్ల వయసులో చెన్నైలో కను మూశారు.
ప్రభుత్వ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేట్ బ్యాంకుగా మలచడంలో కీలక పాత్ర పోషించారు.
దాదాపు 18 సంవత్సరాలపాటు వ్యవస్ధాపక చైర్మన్ తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగారు.
1960లో ఎస్బీఐ తో ఆయన ప్రస్ధానం మొదలైంది. ఎస్బీఐ నుంచి బయటికి వచ్చిన వాఘల్ కొంత కాలం పాటు నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియాలో అధ్యాపకుడిగా పని చేశారు.
హెచ్ డి ఎఫ్ సి తర్వాత ఐసీఐసీఐ బ్యాంకును దేశంలోనే రెండో అతి పెద్దగా ప్రైవేట్ బ్యాంకుగా మలచటంలో ప్రధాన భూమిక నిర్వహించారు.
Details
మూడో అతి పెద్ద జాతీయ పురస్కారం అందుకున్న నారాయణ్ వాఘల్
2006లో బ్యాంకింగ్ రంగానికి చేసిన సేవలకు గాను మూడో అతి పెద్ద జాతీయ పురస్కారం పద్మభూషణ్ ను అందుకున్నారు.
44 ఏళ్ల వయసులో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ ఆయ్యారు. అతి పిన్న వయసులో ఆయనను ఆ పదవి వరించింది.
హైదరాబాద్ లో ఐసీఐసీఐ నాలెడ్జ్ బ్యాంకు ఏర్పాటులో వాఘల్ కీలక పాత్ర పోషించారు. ఆయన మృతికి పలువురు బ్యాంకింగ్ రంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.