Page Loader
National Pension System : NPS విత్‌డ్రా కొత్త రూల్‌.. SLWతో ఆటంకం లేని ఆదాయం
National Pension System : NPS విత్‌డ్రాలో సడలింపులు.. SLWతో నిరంతర ఆదాయం

National Pension System : NPS విత్‌డ్రా కొత్త రూల్‌.. SLWతో ఆటంకం లేని ఆదాయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 23, 2023
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

National Pension System (ఎన్‌పీఎస్‌) విత్‌డ్రాల్'కు సంబంధించి పీఎఫ్‌ఆర్‌డీఏ ఇటీవలే కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగానే 'సిస్టమేటిక్‌ లంప్‌ సమ్‌ విత్‌డ్రా (SLW)ను ప్రవేశపెట్టింది. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS)లో 'పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA)' తాజాగా మార్పులు చేర్పులు చేసింది. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌(NPS)లో భాగంగా 'పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA)' 'సిస్టమేటిక్‌ లంప్‌ సమ్‌ విత్‌డ్రా (SLW) వసతిని ఏర్పాటు చేసింది. ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులు ఇకపై తమ పెన్షన్ నిధి మొత్తం నుంచి 60 శాతం SLW ద్వారా వాయిదా పద్ధతుల్లో పొందేందుకు వీలు కలిగింది. నెల, 3 నెలలు, 6 నెలలు,ఏడాది అనుగుణంగా కోరుకున్న మొత్తాన్ని పొందవచ్చు.

Details

ఎస్‌ఎల్‌డబ్ల్యూను మోడ్'ను ఎంచుకుంటే క్రమం తప్పకుండా విత్‌డ్రా

అయితే 75ఏళ్లు వచ్చేవరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందే వీలుంది.రిటైర్మెంట్‌ సమయంలో ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇదీ పాత నిబంధనలు : ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారులు తమ నిధి నుంచి 60 శాతం మేర రిటైర్మెంట్‌ సమయంలో ఉపసంహరించుకోవాలి. అవసరం ఉంటేనే దీన్ని 75 ఏళ్ల వరకు దశల వారీగా వాయిదా వేసుకోవచ్చు.ఫలితంగా కొందరు NPSలో వచ్చే అధిక వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. మరో ఆఫ్షన్ ఏంటంటే ఏడాదికి ఒక్కసారి అవసరమైన మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. డబ్బు కావాలనుకున్న ప్రతిసారీ విధిగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. అయితే సడలించిన నిబంధనల్లో ఇవేమీ లేకుండా ఎస్‌ఎల్‌డబ్ల్యూను మోడ్'ను ఎంచుకుంటే క్రమం తప్పకుండా విత్‌డ్రాకు అవకాశం ఏర్పడుతుంది.

DETAILS

కొత్త విధానంలో లాభాలు ఏంటంటే :

1. రిటైర్మెంట్‌ తర్వాత అవసరాల కోసం క్రమం తప్పకుండా డబ్బును పొందొచ్చు. 2. యాన్యుటీ ద్వారా వచ్చే పెన్షన్ సహా ఎస్‌ఎల్‌డబ్ల్యూ నుంచి వచ్చే ఆదాయంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా నెలవారీ నిధులను పొందే వీలుంటుంది. 3. మొత్తం ఒకేసారి తీసుకోకపోవడం వల్ల ఎన్‌పీఎస్‌లో ఉన్న మిగిలిన మొత్తానికి అధిక వడ్డీ రేటు వర్తిస్తుంది. 4. ఎస్‌ఎల్‌డబ్ల్యూ విత్‌డ్రాలకూ పన్ను మినహాయింపు ప్రయోజనాలు అందడం గమనార్హం. ఎన్‌పీఎస్‌ (NPS)లో జమ చేసిన మొత్తం నిధిలో నుంచి రిటైర్మెంట్‌ సమయంలో 40 శాతం మొత్తాన్ని కంపల్సరిగా యాన్యుటీలో మదుపు చేయాలి. ఇందులో ఏ మార్పులేదని పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడించింది. కేవలం ఒకేసారి నిధులు పొందేందుకు వీలున్న 60 శాతం నిధికి మాత్రమే ఎస్‌ఎల్‌డబ్ల్యూ వెసులుబాటు