LOADING...
NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 భాషల్లో వెబ్ సేవలు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 భాషల్లో వెబ్ సేవలు

NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 భాషల్లో వెబ్ సేవలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) తాజాగా ఒక మొబైల్‌ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు సులభంగా సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో, తమ వెబ్‌సైట్‌ సేవలను మరింత మెరుగుపరచడం కోసం 11 ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో తెలుగు కూడా ఉండడం విశేషం. ఈ కొత్త వెబ్‌సైట్‌ సేవల ద్వారా మదుపరులు సులభంగా డేటాను యాక్సెస్‌ చేసేందుకు వీలుగా మార్పులు జరిగాయి. ఇప్పటివరకు కేవలం ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు, ఇప్పుడు మలయాళం, బెంగాలీ, తమిళం, కన్నడ, ఒడియా, పంజాబీ, హిందీ, మరాఠీ, గుజరాతీ, అస్సాం వంటి భాషలకు విస్తరించాయి.

Details

మదుపరులకు మరింత సౌకర్యం

ఎన్‌ఎస్‌ఈ మొబైల్‌ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు ఉపయోగించవచ్చు. ఈ యాప్‌ ద్వారా పెట్టుబడిదారులు ఇండెక్స్‌ ఓవర్‌వ్యూలు, మార్కెట్‌ అప్‌డేట్లు, ట్రేడింగ్‌ వాల్యూమ్‌లు, నిఫ్టీ50 పర్‌ఫార్మెన్స్‌ ఇండికేటర్లు, స్టాక్‌ సెర్చ్‌ ఫీచర్‌లు, కస్టమైజ్డ్‌ వాచ్‌లిస్ట్స్‌ వంటి అనేక విషయాలను తెలుసుకోవడం సాధ్యం. ఆప్షన్‌ ట్రేడింగ్‌ సంబంధిత కాల్స్‌, పుట్స్‌ వంటి వివరాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. భాషా పరమైన సమస్యలు ఎదురైనప్పుడల్లా, ఈ మార్పులు పెట్టుబడి దారులకు అనువుగా ఉండనున్నాయి.