Page Loader
యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్
సుసాన్ వోజికి గూగుల్ కు మొదటి మార్కెటింగ్ మేనేజర్.

యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 17, 2023
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ లో తొమ్మిదేళ్ల అధికారం తర్వాత తానూ వైదొలుగుతున్నట్లు యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుసాన్ వోజికి ప్రకటించారు. ఒక బ్లాగ్ పోస్ట్‌లో, కుటుంబం, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆమె గూగుల్ కు మొదటి మార్కెటింగ్ మేనేజర్. తన తర్వాత యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ నాయకత్వాన్ని చేపడతారని వోజ్కికీ పేర్కొన్నారు. భారతీయ-అమెరికన్ మోహన్ 2007లో యాడ్ కంపెనీ డబుల్‌క్లిక్‌ని కొనుగోలు చేసినప్పుడు గూగుల్‌లో చేరారు. అతను 2015లో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పదోన్నతి సాధించారు. యూట్యూబ్ టీవీ, మ్యూజిక్, ప్రీమియం, షార్ట్‌లను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు.

గూగుల్

గూగుల్ లో చేరడానికి ముందు, మోహన్ డబుల్‌క్లిక్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్

గూగుల్ లో చేరడానికి ముందు, మోహన్ డబుల్‌క్లిక్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అతను స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA సంపాదించాడు. అతను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కూడా పొందాడు. గతంలో యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుసాన్ వోజికి పదవి విరమణ గురించి చేసిన ట్వీట్