SBI: కొత్త ఆదాయపు పన్ను విధానం.. కేంద్రం ప్రణాళికలు, ప్రయోజనాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈసారి బడ్జెట్లో పాత ఆదాయపు పన్ను చెల్లింపు విధానంలోని అన్ని రాయితీలను తొలగించి, పూర్తిగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఎస్‌బీఐ రీసెర్చ్ ప్రతిపాదించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న నూతన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేశంలో మధ్యతరగతి ప్రజల నుంచి ఇతర వర్గాల నుండి వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని ఎస్‌బీఐ రీసెర్చ్ సూచించింది.
అలాగే ఆదాయపు పన్ను విధానాన్ని మరింత హేతుబద్ధం చేయాలని ప్రతిపాదించింది.
Details
ఎస్‌బీఐ రీసెర్చ్ చేసిన ప్రతిపాదనలు
ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్)
మినహాయింపు పరిమితిని రూ.50,000 నుండి రూ.1 లక్షకు పెంచాలి.
సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని రూ.25,000 నుండి రూ.50,000కు పెంచాలి.
రూ.10-15 లక్షల మధ్య ఆదాయంపై పన్ను భారాన్ని 15శాతానికి తగ్గించాలి.
అన్ని రకాలైన కాలపరిమితి కల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీకి 15శాతం పన్ను మాత్రమే వసూలు చేయాలి.
వడ్డీ ఆదాయాన్ని ఇతర ఆదాయంగా పరిగణించాలి. సేవింగ్ ఖాతాలపై వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.20వేలకు పెంచాలి.
Details
ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు కొనుగోలు శక్తి తగ్గనుంది
ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల మేర ఆదాయం తగ్గిపోతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇది జీడీపీలో 0.14శాతానికి సమానం.
అయితే దీనివల్ల పన్ను చెల్లింపులు పెరిగి, ప్రజల వద్ద ఆదాయం పెరిగి వినియోగం కూడా పెరుగుతుందని, దాంతో ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఎస్‌బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు.
అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది.
దీని పరిష్కారం పన్ను భారాన్ని తగ్గించడం కావాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Details
రంగాల వారీగా సూచనలు
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు, టాక్స్ ఫ్రీ బాండ్లు, ట్యాక్స్ పెయిడ్ బాండ్లను జారీ చేసే అవకాశం కల్పించాలని చూస్తోంది.
వ్యవసాయ రంగానికి మేలు చేసే విధంగా క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్, ఎంఎస్‌ఎంఈ విభాగానికి పీఎల్‌ఐ స్కీము అమలు చేయనున్నారు.
ఆర్థిక లోటు అంశంపై ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా 2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును 4.5శాతానికి పరిమితం చేయాలని సూచించింది.