Air India New Logo: ఎయిర్ ఇండియాకు నయా లోగో.. ఎలా ఉందంటే?
ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసినప్పుడు నుంచి టాటా గ్రూప్ వివిధ మార్పులకు శ్రీకారం చూడుతోంది. తాజాగా ఆ సంస్థ లోగో, ఎయిర్ క్రాప్ట్ లివరీ మార్పులను తీసుకొచ్చింది. గతంలో ఉన్న లోగో స్థానంలో గులాబీ రంగుపై తెల్లని అక్షర అక్షరాలతో 'AIR INDIA' అని మార్చారు. దానికి పైన మహారాజా మస్కట్ ను కూడా పొందుపరిచారు. అవధుల్లేని అవకాశాలకు చిహ్నంగా ఈ లోగో ప్రతిబింబిస్తుందని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. డిసెంబర్ 2023 నుంచి ఈ కొత్త లోగోతో ఈ విమానాల సర్వీసులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా కొత్త లోగో సింబల్ కు ది విస్టా గా నామకరణం
ఎయిర్ ఇండియా కొత్త లోగో సింబల్‌కు 'ది విస్టా' అని పేరు పెట్టారు. ఇందులో గోల్డెన్, రెడ్, పర్పుల్ కలర్స్ ఉన్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ విమాన తయారీ సంస్థ నుంచి దాదాపు 70 మిలియన్ డాలర్ల విలువైన 470 విమానాల కొనుగోలు చేసేందుకు ఒప్పందాలను కుదుర్చుకుంది. అదే విధంగా ఈ ఏడాది నవంబర్ నుంచి కొత్త విమనాల డెలివరీలు మొదలు కానున్నాయి. ఎయిరిండియాలో అధునాతన మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడమే తమ లక్ష్యమని చైర్మన్ ఛంద్రశేఖరన్ వెల్లడించారు.