Page Loader
RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!
మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!

RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త రూపంలో రూ.20 నోటును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త నోటుపై ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని పేర్కొంది. డిజైన్ పరంగా ఈ నోటు మహాత్మా గాంధీ సిరీస్‌లో ఇప్పటికే చలామణిలో ఉన్న రూ.20 నోటుకు పోలి ఉంటుంది. పాత రూ.20 నోట్లు చెలామణిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అంటే కొత్త నోటు పరిచయం అయిన తర్వాత పాత నోట్లపై ఎటువంటి ఆంక్షలు ఉండవు.

Details

కొత్త నోటు డిజైన్‌ విషయాలు

కొత్త నోటు డిజైన్‌లో కొంత మార్పు ఉండే అవకాశం ఉంది. రంగుల్లో స్వల్ప తేడా ఉండవచ్చు. మహాత్మా గాంధీ చిత్రం మరింత స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు. వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, నంబర్ ప్యాటర్న్ వంటివి మరింత బలోపేతం చేశారు.

Details

 కొత్త నోట్ల జారీపై ఆర్‌బీఐ ఉద్దేశ్యం ఇదే

నకిలీ నోట్లను అడ్డుకోవడం, ప్రజలకు సురక్షిత కరెన్సీ అందించడం రిజర్వ్ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. అదనంగా, కొత్తగా నియమితులైన గవర్నర్ సంతకంతో నోట్లను విడుదల చేయడం అనునిత్య ప్రక్రియగా కొనసాగుతుంది. పాత నోట్ల గురించి స్పష్టత పాత నోట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని RBI స్పష్టం చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిన పని లేదు. పాత నోట్లు, కొత్త నోట్లు రెండూ సమానంగా చెలామణిలో ఉండేలా చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. కొత్త నోట్లు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఈ పరిణామంతో ప్రజలు కొత్త నోటుపై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే పాత నోట్ల గడువు లేదా చెలామణి ఆంక్షలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం అవుతోంది.