Page Loader
SIF Investment Funds : హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం!
హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం!

SIF Investment Funds : హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంపన్న పెట్టుబడిదారుల కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త పెట్టుబడి విధానాన్ని ప్రవేశపెట్టింది. 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' (సిఫ్) పేరుతో ఈ విధానాన్ని రూపొందించారు. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. సిఫ్‌లో పెట్టుబడి వివరాలు పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.50 లక్షలు అవసరం. అదే సిఫ్‌లో కనీసం రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాలి. మూడు ఏళ్లకు పైగా కార్యకలాపాలు కలిగిన ఇన్వెస్టర్లకు విభిన్న పెట్టుబడుల ఎంపికను అందిస్తుంది. ఈ విధానం హై రిస్క్ తీసుకునే పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

Details

 సిఫ్ ప్రత్యేకతలు

పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు సెబీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. సిఫ్‌లో కనీసం రూ.10 లక్షల పెట్టుబడి అవసరం. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు కనీసం 3 ఏళ్ల ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. గత 3 ఏళ్లలో సగటున రూ.10,000 కోట్ల కలిగి ఉండాలి.

Details

 అర్హత ప్రమాణాలు 

గత 3 ఏళ్లలో సెబీ చట్టం కింద ఏమైనా నియంత్రణ చర్యలు ఎదుర్కొనరాదు. పరిమిత అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లకు అవకాశం కల్పించేందుకు కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఒక AMC కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ను నియమించాలి. సగటున రూ.5,000 కోట్ల కన్నా తక్కువ కాకుండా AUM పర్యవేక్షించాలి. రూ.500 కోట్ల AUM నిర్వహణలో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్న సెకండరీ ఫండ్ మేనేజర్ ఉండాలి.

Details

 ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్, రిస్క్ లెవల్స్ 

మార్కెట్ రూ.10 లక్షల లోపు పతనమైనా మిగిలిన మొత్తం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. సిఫ్ 25శాతం డెట్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంటుంది. బ్యాండ్ 1 నుంచి బ్యాండ్ 5 వరకు మొత్తం 5 రిస్క్ స్థాయిలను సెబీ విభజించింది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అవకాశం ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సెబీ అనుమతితో సిఫ్ ప్రారంభించవచ్చు. కనీసం రూ.10,000 కోట్ల ఆస్తులను నిర్వహిస్తున్న సంస్థలు అప్లయ్ చేసుకోవచ్చు. మూడు సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు మాత్రమే అనుమతి. సంపన్న పెట్టుబడిదారులకు మరింత ప్రయోజనకరంగా సెబీ కొత్తగా ప్రవేశపెట్టిన 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' పెట్టుబడికి కొత్త మార్గాలను అందించనుంది.