LOADING...
EPFO 3.0 : ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు సులభంగా తీసుకునే మార్గమిదే
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు సులభంగా తీసుకునే మార్గమిదే

EPFO 3.0 : ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు సులభంగా తీసుకునే మార్గమిదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై పీఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) కీలక మార్పులు తీసుకొస్తోంది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానం ద్వారా సభ్యులు యూపీఐ సాయంతో తమ పీఎఫ్ డబ్బును త్వరగా పొందగలరు. ఇప్పటివరకు పీఎఫ్ క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బు ఖాతాలో జమ కావడానికి ఎక్కువ సమయం పట్టేది. అయితే ఈపీఎఫ్ఓ 3.0తో యూపీఐ ద్వారా రియల్‌టైమ్‌లోనే డబ్బును బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

వివరాలు

UMANG యాప్‌తో సులభం

ఉద్యోగం కోల్పోయిన వెంటనే ఖాతాదారులు తమ పీఎఫ్‌లోని 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అవసరమైతే తర్వాత తీసుకునే వీలుంటుంది. పేపర్‌వర్క్ అవసరం లేకుండా పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. UMANG యాప్ లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా యూపీఐ పిన్‌తో వెరిఫికేషన్ చేసి ఏటీఎం ద్వారా డబ్బులు పొందవచ్చు. భారీ క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా, క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా తగ్గుతుంది. రిక్వెస్ట్ ఇచ్చిన వెంటనే ఇన్‌స్టంట్ క్రెడిట్ ద్వారా డబ్బు ఖాతాలోకి చేరుతుంది.

వివరాలు

75 శాతం వెంటనే.. మిగతా 25 శాతం తర్వాత

కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోతే పీఎఫ్‌లోని 75 శాతం వరకు వెంటనే తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతం బ్యాలెన్స్ ఒక నెల వరకు ఖాతాలో ఉంటుంది. ఆ సమయానికి ఉద్యోగం దొరకకపోతే, ఆ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధన ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

వివరాలు

యూపీఐ వాడే ముందు తెలుసుకోవాల్సినవి

UAN యాక్టివేట్ అయి ఉండాలి ఆధార్ కార్డు పీఎఫ్ ఖాతాకు లింక్ అయి ఉండాలి మొబైల్ నంబర్, ఆధార్, యూపీఐ యాప్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ KYC పూర్తి చేసి ఉండాలి కంపెనీ ద్వారా అన్ని వివరాలు వెరిఫై అయి ఉండాలి

Advertisement

వివరాలు

యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా విధానం

ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాలి యూపీఐ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఎంచుకుని అవసరమైన మొత్తం నమోదు చేయాలి యూపీఐ పిన్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది యూపీఐ సపోర్ట్ ఉన్న ఏటీఎంలో QR క్యాష్ ఆప్షన్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు

వివరాలు

సామాన్యులకు లాభాలేమిటి?

ఈ కొత్త విధానం వల్ల పీఎఫ్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అప్లికేషన్ ఫారాలు నింపాల్సిన పని లేకుండా, డబ్బు త్వరగా ఖాతాలోకి చేరుతుంది. అత్యవసర అవసరాల కోసం, ముఖ్యంగా వైద్య ఖర్చుల కోసం వెంటనే నగదు పొందే వీలుంటుంది. మోసాలకు అవకాశం తగ్గుతుంది. అలాగే యూపీఐ యాప్‌ల ద్వారా విత్‌డ్రాయల్స్‌ను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. మొత్తంగా ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ మరింత వేగవంతం, పారదర్శకంగా మారనుంది.

Advertisement