
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్.. 25 వేలు దాటిన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభంలో ముగిసాయి.అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత ఉన్నా, దేశీయ సూచీలు పాజిటివ్‌గా కొనసాగాయి. వరుసగా రెండురోజుల పాటు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూడడంతో మదుపర్లు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు ప్రారంభించగా, ఇది సూచీలలో పాజిటివ్ రికవరీకి దారితీసింది. ఫలితంగా, సెన్సెక్స్ 590 పాయింట్లకు పైగా పెరిగింది,నిఫ్టీ కూడా 170 పాయింట్ల పెరుగుదలతో ముగిసింది.
వివరాలు
రూపాయి డాలర్‌తో పోలిస్తే 88.10గా నమోదు
ఉదయం 82,350 స్థాయిలో 320 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సూచీలు రోజంతా పాజిటివ్ ట్రెండ్‌ను కొనసాగించాయి. చివరికి, ఇంట్రాడే లెక్క ప్రకారం 575.45 పాయింట్ల లాభంతో 82,605.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 178 పాయింట్ల పెరుగుదలతో 25,323.55 వద్ద ముగిసింది. రూపాయి డాలర్‌తో పోలిస్తే 88.10 వద్ద నిలిచింది. నిఫ్టీ లో ప్రధాన లాభపడ్డ షేర్లలో బజాజ్ ఫైనాన్స్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్ ఉన్నాయి. మరియూ, బజాజ్ ఆటో, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.