NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800 
    లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800

    Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@23,800 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠాల వద్ద మదుపర్లు చేసిన కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లో సెంటిమెంట్ బలపడింది.

    దీని ఫలితంగా నేటి ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 23,800 స్థాయికి పైగా కదలాడింది.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 78,806 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 23,854 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్,టాటా మోటార్స్, జొమాటో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    వివరాలు 

    బంగారం ఔన్సు ధర 2,652.70 డాలర్లు 

    అయితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, అదానీ పోర్ట్స్,టైటాన్, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ వంటి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    బంగారం ఔన్సు ధర 2,652.70 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 85.34 వద్ద కొనసాగుతోంది.

    అమెరికా మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి.ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా షేర్లను విక్రయిస్తూనే ఉన్నారు.

    గురువారం కూడా వారు నికరంగా రూ.2,377 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ఇక, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.3,336 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్

    స్టాక్ మార్కెట్

    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,100 ఎగువకు నిఫ్టీ బిజినెస్
    Stock market: నేడు నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, 24,100 మార్క్‌ దిగువకు నిఫ్టీ  సెన్సెక్స్
    Stock market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80వేల మార్క్‌ని దాటిన సెన్సెక్స్‌  బిజినెస్
    Stock market: నేడు లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025