తదుపరి వార్తా కథనం
Union Budget 2025: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్.. నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభం (వీడియో)
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 01, 2025
11:25 am
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగం ప్రారంభించారు.
ఇది ఆమె వరుసగా 8వసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు, నిర్మలా సీతారామన్ ట్యాబ్ తీసుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుసుకున్నారు.
ప్రథమ పౌరురాలి అనుమతి తీసుకున్న అనంతరం పార్లమెంట్‌కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి, బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
ఆ తర్వాత నిర్మలమ్మ లోక్‌సభలో వార్షిక పద్దును సమర్పించారు.