Page Loader
Niva Bupa IPO: 'ఐపీఓలోకి అడుగుపెట్టనున్న నివా బుపా'.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు వెల్లడించిన కంపెనీ!
'ఐపీఓలోకి అడుగుపెట్టనున్న నివా బుపా'.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు వెల్లడించిన కంపెనీ!

Niva Bupa IPO: 'ఐపీఓలోకి అడుగుపెట్టనున్న నివా బుపా'.. సబ్‌స్క్రిప్షన్ తేదీలు వెల్లడించిన కంపెనీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ప్రయివేటు బీమా సంస్థ 'నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌' త్వరలో మార్కెట్లోకి తన ఐపీఓను ప్రవేశపెట్టనుంది. రూ.2,200 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో ఈ పబ్లిక్ ఇష్యు రానుంది. ఐపీఓకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6న ప్రారంభమై, 8న ముగియనుంది. నివా బుపా, ఐపీఓ ద్వారా రూ.800 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇక రూ.1,400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా, ప్రమోటర్ అయిన బుపా సింగపూర్ హోల్డింగ్స్ లిమిటెడ్‌, ఇన్వెస్టర్ అయిన ఫెటిల్ టోన్ ఎల్‌ఎల్‌పీ తమ వాటాలను విక్రయించనున్నారు. కంపెనీలో ప్రమోటర్లకు 89.07% వాటా ఉంది.

Details

నవంబర్ 13న లిఫ్టింగ్

ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను, కంపెనీ నికర ఆదాయాన్ని బలోపేతం చేయడం, మిగిలిన డబ్బును కార్పొరేట్ అవసరాలకు వినియోగించడానికి ఉపయోగించనున్నట్లు సంస్థ పేర్కొంది. షేర్ల లిస్టింగ్ తేదీ నవంబర్ 13న జరగనుంది. అయితే, ధరల శ్రేణి ఇంకా ప్రకటించాల్సి ఉంది. నూతన ఐపీఓలలో ఇది నాలుగో ఆరోగ్య బీమా సంస్థగా నిలుస్తోంది. దీని ముందు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ఉన్నాయి.

Details

81.85 కోట్ల నికర లాభం

2024 ఆర్థిక సంవత్సరంలో, ఈ సంస్థ 12.5 కోట్ల నుండి 81.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 18.8 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ ఐపీఓకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మోతీలాల్ ఓస్వాల్ వ్యవహరించనున్నారు.