Page Loader
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు; లీజు ప్రక్రియపై ఎన్ఎండీసీ ఫోకస్ 

వ్రాసిన వారు Stalin
Jun 27, 2023
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ ఇనుప ఖనిజ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీ ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు సన్నద్ధమవున్నట్లు సమాచారం. ఇనుప ఖనిజాల తవ్వకంలో ఎంతో అనుభవం ఉన్న ఎన్ఎండీసీ సంస్థ బంగారం మైన్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని చిగరగుంట-బిసానాథం గోల్డ్ బ్లాక్‌‌ను త్వరలోనే ఎన్‌ఎండీసీ లీజుకు తీసుకోనుంది. గత ఏడాది చివరలోనే ఈ మైనింగ్ ఒప్పందానికి సంబంధించిన ఇంటెంట్ లెటర్‌పై ఎన్ఎండీసీ సంతకం చేసింది. ఇంటెంట్ లెటర్‌పై సంతకం చేసిన మూడు సంవత్సరాలలోపు గోల్డ్ బ్లాక్ మైనింగ్ లీజును పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లీజు ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఎన్‌ఎండీసీ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

బంగారం

చిగరగుంట-బిసానాథం గోల్డ్ బ్లాక్‌‌లో 1.83 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు 

చిగరగుంట-బిసానాథం గోల్డ్ బ్లాక్‌‌‌లో తవ్వకాల కోసం ఎన్‌ఎండీసీ రూ.500కోట్ల (61 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ బ్లాక్‌లో దాదాపు 1.83 మిలియన్ టన్నుల బంగారం ఖనిజం నిల్వలు ఉన్నాయని, టన్నుకు 5.15 గ్రాముల బంగారం వస్తుందని గతంలో సర్వే చేసిన సంస్థలు తెలిపాయి. పర్యావరణ అనుమతులు వంటి ప్రభుత్వ అనుమతులను పొందడంలో సహాయపడటానికి ఒక కన్సల్టెంట్‌ను నియమించాలని ఎన్ఎండీసీ భావిస్తోంది. చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద బంగారాన్ని వినియోగిస్తున్న దేశం భారత్. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగల్లో బంగారం తప్పనిసరిగా వినియోగిస్తారు. అందుకే దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బంగారం డిమాండ్‌లో 90శాతం కంటే ఎక్కువ దిగమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది