
ATM New Rules : మీ బ్యాంక్ ఏదైనా సరే.. డబ్బు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్.. ఇప్పుడు అన్నింటికీ ఛార్జీనే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఒక్కరూ తరచూ ఉపయోగించే ఏటీఎం సేవలపై రూల్స్ ఇక మారనున్నాయి.
మే 1, 2025 నుంచి అన్ని బ్యాంకుల ఖాతాదారులకూ ఈ కొత్త రూల్స్ వర్తించనున్నాయి. దీంతో ఏటీఎం వినియోగదారులకు అదనపు భారం పడనుంది.
ఏటీఎం రూల్స్‌లో కీలక మార్పులు
డబ్బును విత్‌డ్రా చేసుకునే ఖాతాదారులకు నూతన ఛార్జీలు అమలు కానున్నాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించింది.
దీనితో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునే వారికి అదనపు ఛార్జీలు వర్తించనున్నాయి.
Details
ఇప్పుడు ఛార్జీలు ఎంతగా పెరుగుతున్నాయి?
విత్‌డ్రా ఛార్జీ
ఇప్పటి వరకు: రూ.17
మే 1 నుంచి: రూ.19
బ్యాలెన్స్ చెక్ ఛార్జీ
ఇప్పటి వరకు: రూ.7
మే 1 నుంచి: రూ. 9
ఎందుకు ఛార్జీలు పెరిగాయి
ATM నెట్‌వర్క్ ఆపరేటర్లు, వైట్ లేబుల్ ATM సంస్థలు తమ నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులు పెరిగినందున ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాలని NPCI ద్వారా డిమాండ్ చేశాయి.
దీనిపై RBI ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఇది ATM నెట్‌వర్క్‌పై ఆధారపడే బ్యాంకులపై ప్రభావం చూపనుంది.
Details
ఎవరికి ఎక్కువ ప్రభావం?
నాన్-హోమ్ బ్యాంక్ ATMలు ఎక్కువగా వాడే యూజర్లకు ఇది వెరీ కాస్ట్లీ డీల్ అవుతుంది. హోమ్ బ్రాంచ్ ATMలు వాడితే ఛార్జీలు తగ్గుతాయి.
డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ (UPI, మొబైల్ బ్యాంకింగ్) వాడటం ద్వారా ఛార్జీలను తప్పించవచ్చు
SBI ఇప్పటికే మార్పులు చేసింది
ఫిబ్రవరి 1, 2025 నుంచి SBI తన ఖాతాదారులకు ATM లావాదేవీలపై కొన్ని ఛార్జీల మార్పులు తీసుకొచ్చింది. ఇక మే 1, 2025 నుంచి RBI మార్గదర్శకాల ప్రకారం అన్ని బ్యాంకులకు పెరిగిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి.