LOADING...
FASTag : టోల్ ప్లాజాల్లో ఇక నో క్యాష్..నేటి నుంచే కొత్త రూల్ అమలు.. కారణం ఇదే!
టోల్ ప్లాజాల్లో ఇక నో క్యాష్..నేటి నుంచే కొత్త రూల్ అమలు.. కారణం ఇదే!

FASTag : టోల్ ప్లాజాల్లో ఇక నో క్యాష్..నేటి నుంచే కొత్త రూల్ అమలు.. కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ హైవేలపై ప్రయాణం ఇక మరింత వేగంగా, అంతరాయం లేకుండా మారబోతోంది. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయే పరిస్థితులకు త్వరలో పూర్తిగా ముగింపు పలకనున్నారు. భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) టోల్ వసూళ్లను పూర్తిగా డిజిటల్ చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ప్రణాళిక ప్రకారం 2026 ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది.

వివరాలు

ఎందుకు ఈ నిర్ణయం?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ లావాదేవీల్లో సుమారు 98 శాతం ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయి. కేవలం 2 శాతం మాత్రమే నగదు లేదా యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. అయితే ఈ స్వల్ప శాతం వాహనాలే టోల్ ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్‌కు కారణమవుతున్నాయని NHAI గుర్తించింది. ఇప్పటికే నగదు చెల్లింపులపై రెట్టింపు రుసుము, యూపీఐ చెల్లింపులపై 1.25 రెట్లు అదనపు ఛార్జీలు విధిస్తున్నప్పటికీ, సమయ నష్టం తగ్గకపోవడంతో నగదు వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు.

వివరాలు

ప్రయాణికులకు లాభాలు

నగదు రహిత టోల్ విధానం వల్ల ప్రయాణికులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. టోల్ గేట్ల వద్ద చిల్లర కోసం వేచిచూడాల్సిన అవసరం ఉండదు. రసీదు తీసుకోవడం వంటి ప్రక్రియలు లేకపోవడంతో వాహనాలు వేగంగా ముందుకు సాగుతాయి. 2022-23 గణాంకాల ప్రకారం టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ సమయం 734 సెకన్ల నుంచి 47 సెకన్లకు తగ్గింది. కొత్త విధానం అమలుతో ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ చెల్లింపులతో పారదర్శకత పెరిగి, అవకతవకలకు తావు ఉండదు.

Advertisement

వివరాలు

ఫిర్యాదు చేస్తే రూ.1000 రివార్డు

హైవే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు కేంద్ర రవాణా శాఖ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద ఉన్న అపరిశుభ్ర టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదుదారుడి ఫాస్టాగ్ ఖాతాలో రూ.1000 రివార్డు జమ చేసే విధానం అమలు చేయనుంది. 2026 చివరికి 'బారియర్-ఫ్రీ' టోల్ వ్యవస్థ ఇంకా ముందుకు వెళ్లి, 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా 'బారియర్-ఫ్రీ' టోల్ సిస్టమ్ అమలు చేయాలని NHAI లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానంలో టోల్ గేట్లు లేదా అడ్డంకులు ఉండవు. వాహనాలు ఆగకుండా వెళ్లిపోతుండగానే టోల్ రుసుము ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఇందుకోసం అధునాతన కెమెరాలు, జీపీఎస్ ఆధారిత సాంకేతికతను వినియోగించనున్నారు.

Advertisement