LOADING...
NTPC: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అణు విద్యుత్‌ ప్లాంట్ల దిశగా ఎన్‌టీపీసీ అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అణు విద్యుత్‌ ప్లాంట్ల దిశగా ఎన్‌టీపీసీ అడుగులు

NTPC: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అణు విద్యుత్‌ ప్లాంట్ల దిశగా ఎన్‌టీపీసీ అడుగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ విద్యుత్‌ తయారీ సంస్థ ఎన్‌టీపీసీ, పలు రాష్ట్రాలలో 700 మెగావాట్లు, 1000 మెగావాట్లు, 1600 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త అణువిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సంస్థలోని సీనియర్‌ అధికారి వెల్లడించారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (AERB) ఆమోదం పొందిన ప్రాంతాలలోనే, బోర్డు సూచనలను అనుసరించి ప్లాంట్లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. 2047 నాటికి దేశంలో 100 గిగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో, దాదాపు 30 గిగావాట్ల భాగస్వామ్యాన్ని అందుకోవడమే ఎన్‌టీపీసీ లక్ష్యం.

వివరాలు 

రాజస్థాన్‌లో రూ.42,000కోట్ల వ్యయంతో ఒక అణువిద్యుత్‌ ప్లాంటు నిర్మాణం 

ఒక్క గిగావాట్‌ అణువిద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేయడానికి సుమారు రూ.15,000 నుంచి రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని,నిర్మాణం ప్రారంభం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి మొదలయ్యే వరకు కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందని సంస్థ అంచనా వేస్తోంది. అణు ప్రాజెక్టులకు అవసరమైన ముడి పదార్థాల సమీకరణపై కూడా ఎన్‌టీపీసీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా యురేనియం సరఫరా కోసం విదేశీ వనరులను పరిశీలిస్తూ, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వాణిజ్య,సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం ఎన్‌టీపీసీ దేశవ్యాప్తంగా మొత్తం 84,848 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో బొగ్గు,గ్యాస్‌,హైడ్రో, సౌర ప్రాజెక్టులు ఉన్నాయి.అదేవిధంగా,రాజస్థాన్‌లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌తో కలిసి దాదాపు రూ.42,000కోట్ల వ్యయంతో ఒక అణువిద్యుత్‌ ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టింది.