LOADING...
Nvidia on H-1B fees:'వలసదారులకి అవకాశాలు కొనసాగిస్తాం'.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై ఎన్విడియా సీఈఓ మద్దతు.. 
హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై ఎన్విడియా సీఈఓ మద్దతు..

Nvidia on H-1B fees:'వలసదారులకి అవకాశాలు కొనసాగిస్తాం'.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై ఎన్విడియా సీఈఓ మద్దతు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్‌-1బీ వీసా ఫీజుల పెంపుపై ఇంకా చర్చలు, గందరగోళం కొనసాగుతోంది. ఈ ఫీజులను పెంచడాన్ని సరైనదని కొందరు టెక్‌ నిపుణులు ఇప్పటికే సమర్థించగా, తాజాగా చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా ట్రంప్ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ, వీసా ఫీజుల విషయంలో వెనుకడుగు వేయలేమని,ఈ వీసాలను కొనసాగిస్తూ స్పాన్సర్ చేస్తామన్న హామీని కూడా ఇచ్చారు. ఆంగ్ల మీడియా రిపోర్టుల ప్రకారం, హువాంగ్ తన ఉద్యోగులకు ఈ సందేశం పంపినట్లు వెల్లడయ్యింది.

వివరాలు 

వలస వచ్చిన ప్రతిభావంతులే ఎన్విడియాను నిర్మించారు: జెన్సన్‌ హువాంగ్

''ఎన్విడియాలో చాలా మంది ప్రతిభావంతులైన వలసదారులు పని చేస్తున్నారు. అమెరికాలో లభించిన అవకాశాలు మన జీవితాలను ఎంతగానో తీర్చిదిద్దాయని నేను విశ్వసిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా వలస వచ్చిన ప్రతిభావంతులే ఎన్విడియాను నిర్మించారు. వలసదారులు లేకపోతే ఇది సాధ్యమే కాదని గుర్తించాలి. సాంకేతిక రంగంలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడానికి చట్టబద్ధమైన వలసలు ఇంకా చాలా అవసరం. కాబట్టి హెచ్‌-1బీ ఫీజుల పెంపుపై పట్టించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను మనం తీసుకుంటాము'' అని జెన్సన్‌ హువాంగ్‌ తన సందేశంలో హామీ ఇచ్చారు.

వివరాలు 

మస్క్ కంపెనీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి 

ఈ హెచ్‌-1బీ ఫీజుల పెంపుపై జెన్సన్ హువాంగ్ గతంలోనూ స్పందించగా,ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఒక గొప్ప ప్రారంభం అని అభిప్రాయపడ్డారు.అయితే,లక్ష డాలర్లు అనే రుసుము కొంత ఎక్కువగా ఉందని, ముఖ్యంగా స్టార్టప్‌లు ఈ మొత్తాన్ని భరించలేవని కూడా హువాంగ్ పేర్కొన్నారు. మరోవైపు,ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కంపెనీకి ఎన్విడియా భారీ పెట్టుబడులు చేసేందుకు సిద్ధమవుతోంది. మస్క్ ఆధ్వర్యంలోని కృత్రిమ మేధ సంస్థ 'ఎక్స్‌ఏఐ'ని చాట్‌జీపీటీకి పోటీగా విస్తరించడానికి పలు దిగ్గజ ఇన్వెస్టర్లు సుమారు 20బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందులో ఎన్విడియా కూడా భాగస్వామిగా ఉంటుంది. జెన్సన్ హువాంగ్ ప్రకారం,తాము మస్క్ కంపెనీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నారు.