Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుతాయన్న ఆశలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గురువారం పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.5 శాతం తగ్గి 94.49 డాలర్లకు చేరగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 0.8 శాతం పడిపోయి 90.59 డాలర్ల వద్ద నిలిచింది. ఒకవైపు సరఫరా అంతరాయం భయాలు కొనసాగుతుండగా, మరోవైపు దౌత్యపరమైన చర్చలు ముందుకు సాగుతున్నాయి. ఇరాన్‌తో వివాదానికి పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో వైట్ హౌస్ ఉన్నప్పటికీ, ఒప్పందానికి రాకపోతే ఆర్థిక ఒత్తిడి మరింత పెంచుతామని హెచ్చరించింది.
వివరాలు
హోర్ముజ్ జలసంధిని పాక్షికంగా తెరిచిన ఇరాన్
ఇదిలా ఉంటే, ఒప్పందం కుదిరితే హర్మూజ్ జలసంధి ఒమాన్ వైపు నుంచి నౌకలకు అనుమతి ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. ఇదే సమయంలో ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలపై అమెరికా పరిమితులు విధించింది. దీంతో ఆ దేశానికి సంబంధించిన సముద్ర వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. అలాగే ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై మినహాయింపులు ఇకపై ఇవ్వబోమని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
వివరాలు
చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాలో సుమారు 20 శాతం అంతరాయం
ఫుజిటోమీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు తోషిటాకా తజావా ప్రకారం, శాంతి ఒప్పందం కుదిరే వరకు చమురు ధరలు మారుతూ ఉంటాయని చెప్పారు. హర్మూజ్ జలసంధిలో రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించేవరకు WTI ధరలు 80 నుంచి 100 డాలర్ల మధ్య ఊగిసలాడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాలో సుమారు 20 శాతం అంతరాయం ఏర్పడింది.
వివరాలు
అమెరికా, ఇరాన్ అధికారులు మరో విడత చర్చలు
ఇక అమెరికా-ఇరాన్ అధికారులు మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇస్లామాబాద్‌లో జరిగిన గత చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. ఏప్రిల్ 22తో ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణను పొడిగించే అంశంపై పరోక్ష చర్చలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి అభ్యర్థన రాలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.