పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ
బెంగుళూరుకు చెందిన రైడ్-షేరింగ్ కంపెనీ ఓలా ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. కంపెనీ కొన్ని విభాగాల నుండి దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సిబ్బంది సంఖ్యను ఓలా ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లు ప్రతికూల ఆర్థిక వాతావరణంతో ఇబ్బంది పడుతున్నాయి. అత్యంత విజయవంతమైన కంపెనీలు కూడా దీని నుండి మినహాయింపు కాదని ప్రస్తుత భారీ ఉద్యోగ కోతలు చెప్తున్నాయి. ఇప్పుడు తొలగించిన ఉద్యోగులు ఓలా క్యాబ్స్, ఎలక్ట్రిక్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందినవారు ఉద్యోగులను తొలగించాలని ఓలా నిర్ణయించడం సంస్థ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగమే. టెక్ తో పాటు ప్రోడక్ట్ విభాగానికి చెందిన ఉద్యోగులకు కూడా కంపెనీ పింక్ స్లిప్‌లను అందజేసింది.
ఈ తొలగింపులు సామర్థ్యాలను మెరుగుపరచడంలో భాగమంటున్న సంస్థ
ఈ తొలగింపులు సామర్థ్యాలను మెరుగుపరచడంలో భాగమని, కీలక ప్రాధాన్యతా రంగాలలో సీనియర్ ప్రతిభతో సహా ఇంజనీరింగ్, డిజైన్‌లో కొత్త నియామకాలను మొదలుపెడతామని ఓలా తెలిపింది. కంపెనీ తన R&D సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇటీవల సాఫ్ట్‌వేర్-యేతర ఇంజనీరింగ్ విభాగాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. తొలగించబడిన ఉద్యోగులకు వారి నోటీసు వ్యవధి ప్రకారం వివిధ ప్యాకేజీలు అందించారు. గత వారం, ఓలా సీఈవో భావిష్ అగర్వాల్ జనవరి 26 నాటికి భారతదేశం అంతటా 100 కొత్త ఓలా ఎలక్ట్రిక్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి, కంపెనీకి కేవలం 100 ఎలక్ట్రిక్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఓలా 10,000 ఎలక్ట్రిక్ క్యాబ్‌ల సముదాయాన్ని ప్రారంభించాలని కూడా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చలేదు.