Ola : కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఓలా.. అక్కడంతా రోబోలే
ఓలా కంపెనీ రైడ్ హెయిలింగ్‌లో సుస్థిత స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే గూగుల్‌ను ఛాలెంజ్ చేస్తూ సొంతంగా మ్యాప్స్ రిలీజ్ చేసింది. తాజాగా మరో వ్యాపారంలో సత్తా చాటేందుకు ఓలా సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్విక్ కామర్స్ విభాగం ఊపందుకుంది. ఇ-కామర్స్ తో పొలిస్తే క్విక్ కామర్స్ రంగానికి మంచి భవిష్యత్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగా ఓలా క్యాబ్స్ మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ క్విక్ డెలివరీ విభాగంలో డిమాండ్ తీర్చడం కోసం సొంత డార్క్ స్టోర్లు ఏర్పాటు చేయాలని తెలుస్తోంది.
యూపీఐ సేవలను ప్రారంభించేందుకు ప్లాన్
అయితే క్విక్ కామర్స్ డెలివరీ కోసం ఉత్పత్తులను నిల్వ ఉంచే గిడ్డంగులలో మానవ ప్రమేయాన్ని తగ్గించడానికి ఓలా రోబోలను మోహరించనున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఈఓ భవిష్ అగర్వాల్ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించే అవాకశం ఉంది. ఇక వినియోగదారులను ఆకర్షించేందుకు తన సొంత యూపీఐ సేవలను సైతం ప్రారంభించడానికి సిద్ధమతోంది. 2022లో ఓలా డాష్‌ను ప్రారంభించి, ఆ తర్వాత నిలిపివేసిన తర్వాత మళ్లీ వాణిజ్యంలోకి ఓలా రెండోసారి అడుగుపెట్టింది.