LOADING...
ONDC: స్విగ్గీ, జోమాటోకు పోటీగా ప్రభుత్వ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్
జోమాటో, స్విగ్గీలకు పోటీగా ONDC

ONDC: స్విగ్గీ, జోమాటోకు పోటీగా ప్రభుత్వ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2023
07:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్విగ్గీ, జోమాటోకు ఓఎన్‌డీసీ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్‌డీసీ దూసుకుపోతోంది. చిన్నస్థాయి సంస్థలకు టెక్నాలజీ పరంగా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో కేంద్రం ఓపెన్ సోర్స్డ్ మెథడాలజీతో ఈ నూతన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీతో పాటు మరో 240 నగరాల్లో ఓఎన్‌డీసీ, జొమాటో, స్విగ్గీలకు సవాల్ విసురుతోంది. ఆహారంతో పాటు నిత్యావసర సరుకుల రోజువారి డెలివరీ సంఖ్య ఇప్పటికే రోజుకు 10వేలు దాటుతోంది. డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును గతేడాది ఏప్రిల్ లో కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Details

బయర్స్ యాప్ లో ఆర్డర్ పెట్టే అవకాశం

స్విగ్గీ, జొమాటో తరహాలో ఓఎన్‌డీసీకి ప్రత్యేకంగా యాప్ లేదు. బయ్యర్ యాప్స్ లోకి వెళ్లి మాత్రమే కొనుగోలు చేయాలి. పేటీఎం, మైస్టోర్, పిన్ కోడ్, స్పైస్ మనీ వంటి యాప్స్ ప్రస్తుతం బయ్యర్ యాప్స్ గా ఉన్నారు. ఒకవేళ మనం ఆర్డర్ చేయాలని అనుకుంటే పేటీఎం యాప్ లోకి వెళ్లి ONDC అని సెర్చ్ చేసి, మనకు నచ్చిన ఆహారాన్ని డెలవరి పెట్టుకోవచ్చు. ఓఎన్‌డీసీ కొత్తది కావడం వల్ల అన్ని రెస్టారెంట్లు, అన్ని పిన్ కోడ్స్ లో అందుబాటులో లేకపోవచ్చు. అయితే భవిష్యతులో వీటి సేవలు మరింత విస్తృతం చేయనున్నారు. ప్రస్తుతం ఓఎన్ డీసీ కి మంచి ఆదరణ లభిస్తోంది.