
ఏడాదిలో రూ.6లక్షల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌కు చెందిన ఒక ఇడ్లీ ప్రేమికుడు గత ఏడాది కాలంలో రూ. 6 లక్షల విలువైన ప్లేట్లకు ఆర్డర్ ఇచ్చారని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది.
బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్‌లతో సహా అతడు మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది.
2022 మార్చి 30 నుంచి ఈ ఏడాది మార్చి 25వ తేదీ వరకు స్విగ్గి తన నివేదికను విడుదల చేసింది. దక్షిణ భారత రుచికరమైన వంటకమైన ఇడ్లీపై స్విగ్గీ ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది.
ఇడ్లీ
12 నెలల్లో 33 మిలియన్ ప్లేట్‌ల ఇడ్లీ డెలివరీ
స్విగ్గీ గత 12 నెలల్లో 33 మిలియన్ ప్లేట్‌ల ఇడ్లీలను డెలివరీ చేసింది. ఇది కస్టమర్‌లలో ఈ డిష్‌కి ఉన్న అపారమైన ప్రజాదరణను సూచిస్తుందని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది.
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలు ఇడ్లీలను ఎక్కువగా ఆర్డర్ చేసే మొదటి మూడు నగరాలని స్విగ్గీ చెప్పింది. ముంబై, కోయంబత్తూర్, పూణే, వైజాగ్, ఢిల్లీ, కోల్‌కతా, కొచ్చి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో పొందుపర్చింది.
ఇడ్లీలను ఆర్డర్ చేయడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన సమయం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఉంటుందని స్విగ్గీ విశ్లేషణ వెల్లడించింది.
చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కోయంబత్తూర్, ముంబై వినియోగదారులు డిన్నర్ సమయంలో కూడా ఇడ్లీలను ఆర్డర్ చేస్తారని పేర్కొంది.