Page Loader
డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ
డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ

డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ

వ్రాసిన వారు Stalin
Mar 30, 2023
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం డేటా చోరీ కేసును స్వీకరించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. 16.8 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటాతో పాటు ప్రభుత్వ, ముఖ్యమైన సంస్థల సున్నితమైన, గోప్యమైన డేటాను సేకరించి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులతో కూడిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది అతిపెద్ద డేటా చోరీ కేసుల్లో ఒకటిగా చెబుతున్నారు.

సైబరాబాద్

దేశ వ్యాప్తంగా డేటా చోరీ చేసిన ముఠా

నిందితులు రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన వివరాలు, మొబైల్ నంబర్లు, నీట్ విద్యార్థులు, ఎనర్జీ & పవర్ సెక్టార్, పాన్ కార్డ్ డేటా, ప్రభుత్వ ఉద్యోగులు, గ్యాస్ & పెట్రోలియం, అధిక నెట్‌వర్త్ వ్యక్తులతో సహా 140 కంటే ఎక్కువ వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని వారు అక్రమంగా సేకరించారు. డీమ్యాట్ ఖాతాలు, విద్యార్థుల డేటాబేస్, ఉమెన్ డేటాబేస్, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల డేటా, బీమా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ హోల్డర్ల వివరాలు, వాట్సాప్, ఫేస్‌బుక్ వినియోగదారులు పలు వర్గాల వారి వివరాలను ఈ మఠా అమ్మకానికి పెట్టింది. దేశవ్యాప్తంగా డేటా చోరీ జరిగినట్లు తేలడంతో రంగంలోకి దిగిన ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.