Onion Price: 40శాతం పెరిగిన ఉల్లి ధరలు.. కారణం ఇదే
ఇప్పటికే వెల్లుల్లి ధరలు పెరిగి వంటిల్లు బడ్జెట్ పై తీవ్రమైన ప్రభావం పడగా.. తాజాగా ఉల్లిపాయ ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు పెరుగుతున్నాయి. దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ లాసల్‌గావ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లో సోమవారం సగటు హోల్‌సేల్ రేట్లు 40 శాతం పెరిగాయి. డిసెంబర్ 11, 2023న దేశీయ వినియోగదారులకు ఉల్లిపాయలను తక్కువ ధరలకు అందించడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ నిషేదించింది. మార్చి 31, 2024 వరకు నిషేదం అమల్లో ఉంటుందని కేంద్రం అప్పుడు పేర్కొంది.
24 గంటల్లోనే రూ.2.43 పెరిగిన కిలో ఉల్లి ధర
ప్రస్తుతం ఉల్లి ధరలు బహిరంగ మార్కెటెలో క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,000, గరిష్టంగా రూ.2,100 ధర పలుకుతోంది. ఫిబ్రవరి 18న వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో కిలో ఉల్లి సగటు ధర రూ.29.83గా ఉంది. ఫిబ్రవరి 19న ఈ సగటు ధర రూ.32.26కి చేరింది. అంటే 24 గంటల్లో దేశంలో ఉల్లి సగటు ధరలు కిలోకు రూ.2.43 పెరాగాయి. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వెల్లుల్లి కిలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో వెల్లుల్లి ధర కిలో రూ. 500-550 మధ్య అమ్ముడవుతోంది.