Onion price: సామాన్యులకు బిగ్ షాక్.. మళ్లీ ఘాటెక్కిన ఉల్లి
దేశంలో ఉల్లిపాయ ధరలు మరింత పెరిగాయి. కొన్ని రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.40-60 మధ్య ఉండగా, ఇప్పుడు అది రూ.70-80కి చేరింది. ఉల్లి దిగుబడి తగ్గడం వల్లనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ,ఆర్థిక రాజధాని ముంబైలో కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ.80కి పెరిగింది. ఇతర నగరాల్లో కూడా ఉల్లి ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ప్రస్తుతం ఆకాశానంటుతున్నాయి.
కూరగాయల ధరలను తగ్గించే చర్యలు
దీంతో సామాన్య ప్రజలు ఇంట్లో వంట చేస్తూ అలసిపోతున్నారు. జీతాలకు తోడు పెరిగే నిత్యావసర ధరలు మరింత భారంగా మారాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల వారి ఆహార అలవాట్లపై కూడా ప్రభావం చూపుతున్నది. ఉల్లితో పాటు వెల్లుల్లి ధర కూడా రెట్టింపు కావడంతో కుటుంబ బడ్జెట్‌ను తడిపేస్తున్నది. కనుక ప్రభుత్వం కూరగాయల ధరలను తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.