తదుపరి వార్తా కథనం

Online Passport Portal: ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ పోర్టల్ 5 రోజుల పాటు బంద్..అపాయింట్ మెంట్లన్నీ రీషెడ్యూల్
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 29, 2024
10:21 am
ఈ వార్తాకథనం ఏంటి
పాస్ పోర్ట్ సేవా పోర్టల్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా పాస్ పోర్ట్ సేవలకు స్వల్ప విరామం కలగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం,ఈసేవలు ఐదు రోజుల పాటు నిలిపివేయబడతాయి. ఇప్పటికే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నవారి అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని పేర్కొన్నారు.
ఈ రీషెడ్యూల్ వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తామని తెలిపారు.
గురువారం, ఆగస్టు29,రాత్రి 8గంటల నుంచి ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోతాయని తెలిపారు. సెప్టెంబర్ 2వరకు కొత్త అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకునే అవకాశం ఉండదని పేర్కొన్నారు.
పాస్ పోర్ట్ తీసుకోవడం లేదా పాస్ పోర్ట్ రిన్యువల్ వంటి సేవలు పొందడానికి ఉపయోగపడే ఈ ఆన్‌లైన్ పోర్టల్ వినియోగదారులకు ఈ సమయంలో అసౌకర్యం కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు.