Page Loader
బిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం
బిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం

బిగ్ ట్విస్ట్.. OpenAI సీఈఓగా సామ్ ఆల్ట్‌మాన్ తిరిగి నియామకం

వ్రాసిన వారు Stalin
Nov 22, 2023
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

OpenAI నుంచి సామ్ ఆల్ట్‌మాన్ హఠాత్తుగా నిష్క్రమించడం వరల్డ్ టెక్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓపెన్ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన సామ్ ఆల్ట్‌మాన్‌ను సొంత కంపెనీ నుంచి తొలగించడంపై గత రెండు రోజులుగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఓపెన్‌ఏఐ- ఆల్ట్‌మాన్ వ్యవహరం ఊహించని మలుపు తిరిగింది. OpenAI సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ చివరకు తిరిగి మళ్లీ తన సొంత కంపెనీలో జాయిన్ కానున్నారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ కంపెనీ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొంది. ఆల్ట్‌మాన్ తిరిగి వస్తారని రాసుకొచ్చింది. ఆల్ట్‌మాన్ తిరిగి కంపెనీలోకి చేరే సమయానికి బోర్డు సభ్యులు కూడా మారనున్నారు. కొత్త సభ్యులు బోర్డులోకి రానున్నారు.

ఓపెన్

ఉద్యోగుల బెదిరింపుతో వెనక్కి తగ్గిన ఓపెన్‌ఏఐ

ఓపెన్‌ఏఐలోని 500 మందికి పైగా ఉద్యోగులు యాజమాన్యంపై ఒత్తిడి తేవడంతో సామ్ ఆల్ట్‌మాన్‌ను తిరిగి తీసుకురావడానికి కంపెనీ అంగీకరించింది. అంతేకాదు.. కంపెనీ బోర్డు సభ్యులందరూ రాజీనామా చేయాలని, లేకుంటే, తాము రాజీనామా చేస్తారని కంపెనీని బెదిరించారు. దీంతో బోర్డు సభ్యులు కూడా వైదొలగనున్నారు. ఇదే సమయంలో ఓపెన్‌ఏఐలో కీలక పెట్టుబడిదారు అయిన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఆల్ట్‌మాన్‌కు మద్దతుగా నిలవడంతో కంపెనీ అతన్ని తప్పనిసరిగా తీసుకురావాల్సి వచ్చినట్లు ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులు చెప్పుకొచ్చారు. ఈ మొత్త వ్యవహారంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదొక ప్రచార స్టంట్ అని పేర్కొన్నారు.