LOADING...
Paytm: బ్యాంక్ అకౌంట్ లేకున్నా టీనేజ్ పిల్లలకు UPI.. Paytm కొత్త 'పాకెట్ మనీ' ఫీచర్
Paytm కొత్త 'పాకెట్ మనీ' ఫీచర్

Paytm: బ్యాంక్ అకౌంట్ లేకున్నా టీనేజ్ పిల్లలకు UPI.. Paytm కొత్త 'పాకెట్ మనీ' ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత విస్తరించే దిశగా పేటియం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'పాకెట్ మనీ' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా టీనేజ్ పిల్లలు UPI చెల్లింపులు చేయగలరు. ఈ సదుపాయం NPCI రూపొందించిన UPI Circle వ్యవస్థ ఆధారంగా పనిచేస్తోంది. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు తమ పేటియం యాప్ ద్వారా పిల్లలకు నియంత్రిత ఖర్చు పరిమితితో డబ్బు వినియోగ అనుమతి ఇవ్వొచ్చు. ఈ ఫీచర్‌తో యువతకు ఆర్థిక స్వతంత్ర భావన కలిగించడమే కాకుండా.. ఖర్చులపై పూర్తి నియంత్రణ తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది.

వివరాలు 

Paytm యాప్‌లోనే 'పాకెట్ మనీ' ఫీచర్‌ను యాక్టివేట్ చేయచ్చు 

పిల్లలు తమ స్మార్ట్‌ఫోన్‌లోని Paytm యాప్ ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్లలో సులభంగా UPI చెల్లింపులు చేయవచ్చు. ఒకసారి సెటప్ చేసిన తర్వాత ప్రతి చెల్లింపుకు OTP అవసరం ఉండదు. అలాగే ప్రతిసారీ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం కూడా తల్లిదండ్రులకు ఉండదు. ఈ 'పాకెట్ మనీ' ఫీచర్‌ను Paytm యాప్‌లోనే యాక్టివేట్ చేయవచ్చు. UPI Circle ద్వారా లింక్ చేసిన బ్యాలెన్స్‌ను ఉపయోగించి టీనేజ్ యూజర్లు చెల్లింపులు చేయగలరు. ఒక్కో ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ.5,000 వరకు పరిమితి ఉండగా.. నెల మొత్తం UPI వినియోగ పరిమితి రూ.15,000గా నిర్ణయించారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్లతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. అయితే అంతర్జాతీయ లావాదేవీలు, నగదు ఉపసంహరణలకు అనుమతి ఉండదు.

వివరాలు 

Paytm UPI PIN ద్వారా యాక్సెస్‌ను రద్దు చేయవచ్చు

భద్రత పరంగా కూడా Paytm పలు జాగ్రత్తలు తీసుకుంది. ఫీచర్ యాక్టివేట్ చేసిన మొదటి 30 నిమిషాల్లో రూ.500 వరకు మాత్రమే చెల్లింపులు చేయగలరు. తొలి 24 గంటల్లో గరిష్టంగా రూ.5,000 వరకే ట్రాన్సాక్షన్లు అనుమతిస్తారు. యాప్ వినియోగానికి డివైస్ లాక్ తప్పనిసరిగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడైనా ఖర్చు పరిమితులను మార్చుకోవచ్చు. అవసరమైతే Paytm UPI PIN ద్వారా యాక్సెస్‌ను రద్దు చేయవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా యాప్‌లోనే పరిశీలించే అవకాశం ఉంటుంది.

Advertisement