NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Paytm job cuts: ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు,అనధికారిక ప్రక్రియలు 
    తదుపరి వార్తా కథనం
    Paytm job cuts: ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు,అనధికారిక ప్రక్రియలు 
    Paytm job cuts: ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు,అనధికారిక ప్రక్రియలు

    Paytm job cuts: ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు,అనధికారిక ప్రక్రియలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 14, 2024
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫిన్‌టెక్ కంపెనీ పేటియం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కంపెనీ పేమెంట్ బ్యాంకుపై నిషేధం ఉండగా.. అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు.

    అంతే కాదు కంపెనీ షేర్ల పరిస్థితి కూడా బాగోలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.550 కోట్లకు పెరిగింది.

    అటువంటి పరిస్థితిలో,సంస్థ తన నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది.

    తమ నుంచి కంపెనీ బలవంతంగా రాజీనామాలు తీసుకుంటోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కంపెనీ నుంచి తొలగించిన ఉద్యోగులు తమ కథనాలు చెబుతున్నారు.

    వివరాలు 

    తక్కువ జీతం,తక్కువ పొజిషన్‌ అయ్యినా ఓకే : ఉద్యోగి   

    ఆ రోజు నేను మీటింగ్‌లో ఉన్నానని కంపెనీ నుంచి తొలగించిన ఓ ఉద్యోగి చెప్పాడు.

    మీటింగ్ లోనే ఏడవడం మొదలుపెట్టాను. తక్కువ జీతం, తక్కువ పొజిషన్‌లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినా వినలేదు.

    గత నెలలో నాకు హెచ్‌ఆర్ నుండి కాల్ వచ్చిందని అతను చెప్పాడు. నేను ఇకపై కంపెనీలో భాగం కానని, జూన్ ప్రారంభంలో రాజీనామా చేయాలని కోరారు.

    వివరాలు 

    నోటీసు లేదు,ప్రశ్నలు,సమాధానాలు లేవు 

    పేటీయం తొలగిస్తున్న ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదు. ఇది కంపెనీ ఫెయిర్ ఎగ్జిట్ పాలసీ కాదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

    ఉద్యోగం నుంచి తొలగిస్తున్న ఉద్యోగులతో కూడా కంపెనీ మాట్లాడటం లేదు. ఇది మాత్రమే కాదు, HR మీటింగ్‌లో ఎటువంటి కమ్యూనికేషన్ లేదా కాల్ రికార్డ్ చేయవద్దని కంపెనీ హెచ్చరిస్తోంది.

    వివరాలు 

    అపాయింట్‌మెంట్ లెటర్ కూడా రాలేదు 

    టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన వార్త ప్రకారం,పేటియంలో ఉద్యోగం పొందిన వ్యక్తులకు వచ్చిన ఆఫర్ లెటర్‌లో, ఆ వ్యక్తి 18 నెలల లోపు ఉద్యోగం వదిలివేస్తే, అప్పుడు ఎంత జాయినింగ్ అమౌంట్, రిటెన్షన్ బోనస్ అయినా రికవరీ చేయబడుతుందని రాసి ఉంది.

    కొన్ని సందర్భాల్లో, ఏదైనా కారణం చేత ఉద్యోగం నుండి తొలగించబడినట్లయితే ఇలాంటి నియమాలు వర్తిస్తాయి.

    అయితే,ఆఫర్ లెటర్‌లో టెర్మినేషన్ క్లాజ్ లేని వారి కోసం,Paytm వారి అపాయింట్‌మెంట్ లెటర్‌లో ఇలా వ్రాయబడిందని, జాయిన్ అయినప్పుడు వారికి ఇచ్చినట్లు చెబుతూ దానిని సమర్థించింది.

    ఇందుకు సంబంధించి తమకు కంపెనీ నుంచి ఎలాంటి లేఖ రాలేదని ఉద్యోగులు చెబుతున్నారు. కంపెనీ ఈ-మెయిల్ చేయలేదు లేదా పోస్ట్ ద్వారా అలాంటి లేఖను పంపలేదు.

    వివరాలు 

    ఆరోపణలను ఖండించిన పేటీయం

    అలాగే, ఎగ్జిట్ పాలసీకి సంబంధించి ఇలాంటి విషయాలు రాసి ఉన్న ఏ లేఖలో కూడా కంపెనీ అతనితో సంతకం చేయించలేదు.

    తాను రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించిందని, అనుభవ లేఖను ఇవ్వలేదని ఓ ఉద్యోగి తెలిపారు.

    కంపెనీపై ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలను పేటీయం ఖండించింది. ఉద్యోగుల తొలగింపు గురించి హెచ్‌ఆర్ ఇప్పటికే అధికారిక మార్గాల ద్వారా తెలియజేసిందని కంపెనీ పేర్కొంది.

    ఉద్యోగుల అపాయింట్‌మెంట్ లెటర్స్‌లో అన్ని విషయాలు, నిబంధనలను వ్రాయాలని ఇప్పుడు మేము మరింత నొక్కిచెబుతున్నామని కంపెనీ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పేటియం

    తాజా

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ డేట్ ఫిక్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్‌  మైక్రోసాఫ్ట్
    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం హైకోర్టు

    పేటియం

    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ ప్లాన్
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం ప్రకటన
    paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే  స్టాక్ మార్కెట్
    Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025