Paytm: భారీగా పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్ల ఆవిరి
పేటియం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్టోక్ మార్కెట్‌లో షేరు విలువ దారుణంగా పడిపోతోంది. బుధవారం ట్రేడింగ్‌లో కూడా పేటీఎం స్టాక్ మళ్లీ 10శాతానికి పడిపోయింది. షేరు ధర 52వారాల గరిష్ఠస్థాయి నుంచి దాదాపు 65.5శాతం క్షీణించింది. అక్టోబర్ 2023లో రూ. 998.3 వద్ద ఉన్న పేటీఎం షేరు విలువ ఇప్పుడు రూ.342.15కు చేరుకుంది. ఇప్పటి వరకు రూ.26,000కోట్ల మేర ఇన్వస్టర్లు నష్టపోయారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కేవైసీ విధానాలలో గణనీయమైన అవకతవకలను ఆర్‌బీఐ గుర్తించింది. దీంతో 2024 ఫిబ్రవరి 29నుంచి పేటీఎం నుంచి అన్నిరకాల లావాదేవీలను ఆర్‌బీఐ నిలిపివేసింది. మరోవైపు, పేమెంట్స్ బ్యాంక్‌కి ప్రత్యామ్నాయం కోసం ఇతర బ్యాంకులతో భాగస్వామ్యానికి పేటీఎం ప్రయత్నిస్తోంది.