Paytm-Groq Partnership: గ్రోక్‌తో పేటీఎం ఒప్పందం.. డిజిటల్ పేమెంట్స్‌లో విప్లవాత్మక ముందడుగు
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ చెల్లింపుల రంగంలో పేటియం మళ్లీ వినూత్న మార్పుల దిశగా ముందుకొచ్చింది. సేవలను మరింత వేగవంతం చేసి, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచే లక్ష్యంతో అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ Groqతో పేటీఎం కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ కలయికతో లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులకు డిజిటల్ లావాదేవీలు మరింత సాఫీగా, వేగంగా సాగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.
వివరాలు
పేటీఎం - Groq సహకార వివరాలు
ఈ భాగస్వామ్యంలో పేటీఎం, Groq అందించే "GroqCloud" సేవను వినియోగించుకోనుంది. దీనికి ఆధారమైన ప్రధాన సాంకేతికత Language Processing Unit (LPU). ఇది కృత్రిమ మేధస్సు ప్రాసెసింగ్‌ను అత్యంత వేగంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. సాధారణ GPU ఆధారిత AI వ్యవస్థలతో పోలిస్తే Groq సాంకేతికత తక్కువ ఖర్చుతో, మరింత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. దీంతో పేటీఎం తన AI ఆధారిత కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, మరింత ఆప్టిమైజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
వివరాలు
పేటీఎం ప్రకటన
ఈ భాగస్వామ్యంపై పేటీఎం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. "చెల్లింపులను త్వరగా,ఖచ్చితంగా ప్రాసెస్ చేయడంలో AI కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మా AI సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నాం. Groqతో మా సహకారం రియల్-టైమ్ AI నిర్ణయాల దిశగా పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఇది భారత్‌లో అత్యంత ఆధునిక AI ఆధారిత చెల్లింపుల & ఆర్థిక సేవల వేదికను నిర్మించే దారిలో కీలక అడుగు" అని తెలిపారు.
వివరాలు
Groq స్పందన అండ్ సాంకేతిక బలం
Groq APAC జనరల్ మేనేజర్ స్కాట్ ఆల్బిన్ మాట్లాడుతూ.."ప్రపంచవ్యాప్తంగా రియల్-టైమ్ AIను అందుబాటులోకి తీసుకురావడంలో మేము ముందంజలో ఉన్నాం.Paytm డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేయడంలో మా సాంకేతికత సహాయపడుతుంది. మా లక్ష్యం AIని అందరికీ ఉపయోగపడే విధంగా మార్చడం" అని అన్నారు. 2016లో స్థాపించబడిన Groq ప్రస్తుతం అమెరికాలో ప్రముఖ AI టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఫార్చ్యూన్ 500 వంటి ప్రముఖ గ్లోబల్ కంపెనీలకూ ఇది సేవలు అందిస్తోంది. ఇప్పటికే పేటీఎం రిస్క్ మోడలింగ్, మోసం నివారణ, కస్టమర్ వెరిఫికేషన్ వంటి విభాగాలలో AIని ఉపయోగిస్తోంది. Groq సాంకేతిక మద్దతుతో, పేటీఎం భవిష్యత్తులో డేటా ఆధారిత ఆర్థిక సేవలను మరింత వేగంతో, మరింత ఖచ్చితత్వంతో అందించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.