Loading...
AP Budget 2026-27: రూ.3,32,205 కోట్ల ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
రూ.3,32,205 కోట్ల ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

AP Budget 2026-27: రూ.3,32,205 కోట్ల ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈసారి మొత్తం రూ.3,32,205 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. తమ దృష్టిలో బడ్జెట్‌ అనేది కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా సమన్వయంతో ముందుకు నడిపించే సంకల్ప పత్రం అని వ్యాఖ్యానించారు.

Details

బడ్జెట్‌ స్వరూపం

మొత్తం బడ్జెట్‌ వ్యయం: రూ.3,32,205 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు

మూలధన వ్యయం: రూ.53,915 కోట్లు

రెవెన్యూ లోటు: రూ.22,002 కోట్లు

ద్రవ్య లోటు: రూ.75,868 కోట్లు

Details

బడ్జెట్‌ ముఖ్యాంశాలు

రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు

విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు

రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.13,546 కోట్లు

పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.3,161కోట్లు

సర్దుబాటు నిధిగా రూ.1,500కోట్లు

వీబీజీ రామ్‌ జీకి రూ.8,365కోట్లు

గృహనిర్మాణ రంగానికి రూ.5,451కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకానికి రూ.4,000కోట్లు

జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ.4,000కోట్లు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037కోట్లు

విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు (ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలో 10 జిల్లాలు)

9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం ఏర్పాటు

రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు

ఈ బడ్జెట్‌ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ADVERTISEMENT