Atal Pension Yojana: నెలకు రూ.5వేలు పెన్షన్.. అటల్ పెన్షన్ యోజనలో చేరితే ఎన్ని లాభాలో తెలుసా!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది. కానీ అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది కార్మికులకు అలాంటి భద్రత ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని ప్రవేశపెట్టింది. 60 ఏళ్ల తర్వాత కూడా సాధారణ జీవనం కొనసాగించేందుకు నెలవారీ పెన్షన్ అందించడం దీని లక్ష్యం. ఇప్పటివరకు సుమారు 9 కోట్ల మంది ఈ పథకంలో చేరారు.
వివరాలు
పథకం గురించి..
2015 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకాన్ని Pension Fund Regulatory and Development Authority నిర్వహిస్తోంది. తక్కువ ఆదాయం కలిగిన అసంఘటిత రంగ కార్మికులకు భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం. 60 ఏళ్లు దాటిన తర్వాత రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. సభ్యుడు మరణిస్తే ఈ పెన్షన్ జీవిత భాగస్వామికి, తరువాత నామినీకి కార్పస్ అందుతుంది.
వివరాలు
అర్హతలు ఇవే
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) లేదా ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నవారు అర్హులు కాదు ఎంత చెల్లించాలి? కాంట్రిబ్యూషన్ వయసు ఆధారంగా మారుతుంది. 18 ఏళ్ల వయసులో చేరితే 42 సంవత్సరాల పాటు చెల్లించాలి - నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు 40 ఏళ్ల వయసులో చేరితే 20 సంవత్సరాల పాటు చెల్లించాలి - నెలకు రూ.291 నుంచి రూ.1454 వరకు
వివరాలు
పెన్షన్ మొత్తం
కంట్రిబ్యూషన్ ఆధారంగా నెలకు రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000 లేదా గరిష్ఠంగా రూ.5000 పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు, 18 ఏళ్ల వయసులో చేరి నెలకు రూ.210 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.5000 పెన్షన్ పొందవచ్చు. అదే 40 ఏళ్లలో చేరితే నెలకు రూ.1454 చెల్లించాలి. మూడు ప్రధాన ప్రయోజనాలు రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన పెన్షన్ సభ్యుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ ఇద్దరూ మరణిస్తే నామినీకి కార్పస్ (రూ.1.7 లక్షల నుంచి రూ.8.5 లక్షల వరకు)
వివరాలు
ఎలా దరఖాస్తు చేయాలి?
బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్, వయసు ధ్రువీకరణ, KYC డాక్యుమెంట్లు. ఆటో డెబిట్ సదుపాయం బ్యాంక్ ఖాతాతో లింక్ చేసి నెలవారీ కాంట్రిబ్యూషన్ ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేలా చేయవచ్చు. ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ విధిస్తారు రూ.100 వరకు - రూ.1 రూ.101-500 - రూ.2 రూ.501-1000 - రూ.5 రూ.1000 పైగా - రూ.10 6 నెలలు చెల్లించకపోతే ఖాతా ఫ్రీజ్, 12 నెలలు అయితే డీయాక్టివేట్, 24 నెలలు అయితే ఖాతా మూసివేస్తారు. కాంట్రిబ్యూషన్ మార్పులు సభ్యులు సంవత్సరానికి ఒకసారి తమ కాంట్రిబ్యూషన్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
వివరాలు
మధ్యలో నిష్క్రమణ
60 ఏళ్లకు ముందే స్వచ్ఛందంగా బయటకు రావచ్చు. అయితే ఛార్జీలు తగ్గించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తారు. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా నిష్క్రమిస్తే పూర్తి మొత్తాన్ని (ప్రభుత్వ వాటాతో సహా) పొందే అవకాశం ఉంటుంది. మరణించిన సందర్భంలో సభ్యుడు 60 ఏళ్లకు ముందు మరణిస్తే జీవిత భాగస్వామి ఖాతాను కొనసాగించవచ్చు లేదా మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చు. భాగస్వామి లేకపోతే నామినీకి మొత్తం అందుతుంది. మొత్తానికి, చిన్న మొత్తాలతో ప్రారంభించి భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కల్పించే ఈ పథకం అసంఘటిత రంగ కార్మికులకు ఒక భద్రమైన ఆర్థిక ఆధారం.