Loading...
Pensioners: పెన్షనర్లకు అలర్ట్.. నవంబర్ 30లోగా ఈ పని పూర్తి చేయాలి.. లేదంటే పింఛను నిలిచిపోయే ప్రమాదం!
లేదంటే పింఛను నిలిచిపోయే ప్రమాదం!

Pensioners: పెన్షనర్లకు అలర్ట్.. నవంబర్ 30లోగా ఈ పని పూర్తి చేయాలి.. లేదంటే పింఛను నిలిచిపోయే ప్రమాదం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఏకీకృత పింఛను పథకం (UPS) కింద పెన్షన్ పొందుతున్న వారికి కీలక సూచన. ప్రతి ఏడాది తప్పనిసరిగా సమర్పించాల్సిన జీవిత ధృవీకరణ పత్రం (Life Certificate) గడువు సమీపిస్తోంది. UPS పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ 30వ తేదీలోగా సమర్పించాలని పింఛను నిధుల నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (PFRDA) సూచించింది. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే నెలవారీ పింఛను చెల్లింపులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే ఈ పని కోసం ఇకపై బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆధార్, మొబైల్ ఫోన్‌లోని ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని ఉపయోగించి ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.

వివరాలు 

UPS జీవన్ సేతు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అంటే ఏమిటి?

UPS పెన్షనర్లు సులభంగా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించేందుకు PFRDA 'UPS జీవన్ సేతు - డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్' సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాధారణంగా పింఛను పొందేవారు తాము జీవించి ఉన్నట్లు నిర్ధారించేందుకు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ధృవీకరణ పూర్తయిన తర్వాతే అర్హులైన వారికి పింఛను చెల్లింపులు కొనసాగుతాయి.

గతంలో ఈ సర్టిఫికెట్ కోసం పెన్షనర్లు బ్యాంకులు లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సి వచ్చేది.

ప్రస్తుతం ప్రోటీన్ ఈ-గవర్నెన్స్ సంస్థకు చెందిన NPS,UPS,APY మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు.

ఆధార్ ఆధారంగా వ్యక్తి గుర్తింపును నిర్ధారించి, ముఖ ధృవీకరణ (Face Authentication) ద్వారా పెన్షనర్ వివరాలను పరిశీలిస్తారు.

వివరాలు 

మొబైల్‌లోనే లైఫ్ సర్టిఫికెట్ ఎలా సమర్పించాలి?

డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలనుకునే పెన్షనర్లు ముందుగా కొన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా PRAN (Permanent Retirement Account Number), పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పింఛను ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ అవసరం.

అనంతరం ఈ కింది విధంగా సర్టిఫికెట్ సమర్పించవచ్చు. ముందుగా మీ మొబైల్‌లో NPS, UPS, APY యాప్‌లలో అందుబాటులో ఉన్న యాప్‌ను ఓపెన్ చేయాలి.

హోమ్ స్క్రీన్‌లో కనిపించే 'UPS జీవన్ సేతు - డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత మీ PRAN నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి ధృవీకరణ పూర్తి చేయాలి.

ADVERTISEMENT

వివరాలు 

మొబైల్‌లోనే లైఫ్ సర్టిఫికెట్ ఎలా సమర్పించాలి?

అనంతరం ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకుని మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. 'Continue with Aadhaar'పై క్లిక్ చేసి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

తర్వాత 'Face Authentication' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. యాప్ సూచనల ప్రకారం మొబైల్ కెమెరా ముందు ముఖాన్ని ఉంచి ఫేస్ వెరిఫికేషన్ చేయాలి.

ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్‌గా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను రూపొందిస్తుంది.

అందులోని వివరాలను మరోసారి పరిశీలించి నిర్ధారించాలి. చివరగా 'Done' బటన్‌పై క్లిక్ చేస్తే లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ ప్రక్రియ పూర్తవుతుంది.

ADVERTISEMENT

వివరాలు 

నవంబర్ 30లోగా సమర్పించకపోతే ఏమవుతుంది?

PFRDA సూచనల ప్రకారం UPS పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీలోగా తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.

పెన్షనర్ జీవించి ఉన్నారనే విషయాన్ని సంబంధిత వ్యవస్థ ఈ సర్టిఫికెట్ ఆధారంగా నిర్ధారిస్తుంది.

నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే నెలవారీ హామీతో కూడిన పింఛను చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

అందువల్ల చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

వివరాలు 

వృద్ధులకు ఎంతో ఉపయోగకరం

కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ డిజిటల్ సదుపాయం గురించి అర్హులైన పెన్షనర్లకు తెలియజేయాలని నోడల్ కార్యాలయాలను కూడా PFRDA ఆదేశించింది.

ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లలేని వారికి ఈ మొబైల్ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంటి నుంచే ఆధార్, ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం లభిస్తుంది.

అయితే ప్రక్రియ పూర్తయిన తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విజయవంతంగా జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.

భవిష్యత్తులో అవసరం పడితే ఉపయోగించుకునేందుకు సర్టిఫికెట్‌కు సంబంధించిన రసీదు లేదా రిఫరెన్స్ వివరాలను భద్రపరుచుకోవాలి.

ADVERTISEMENT