Petrol & Diesel :పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంధన ధరల సవరణ తర్వాత, ప్రధాన నగరాల్లో కొత్త రేట్లు: ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72 నుంచి రూ.94.72కి తగ్గనుంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31 నుంచి రూ.104.21కి తగ్గనుంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.3 నుంచి 103.94కి తగ్గనుంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63 నుంచి 100.75కి తగ్గనుంది