Petrol Prices: ఇంధన ధరలపై ఊరట.. నేడు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గల్ప్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత క్రూడాయిల్ ధరలు కొంత మేర తగ్గినా,తాజా పరిణామాలతో మళ్లీ ఎగబాకుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా జరిగితే భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇంధనాలపై ధరలను పెంచిన నేపథ్యంలో మరోసారి పెంపు ఉంటుందా అనే అంశంపై చర్చ కొనసాగుతోంది.
వివరాలు
ఇంధన ధరల్లో మార్పులేదు
ధరలు పెరిగితే సామాన్యులపై అదనపు భారం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో జూలై 24, 2026 శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ తాజా ధరలను పరిశీలిద్దాం.
ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMసీలు), సహజ వాయువు పంపిణీ సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తాజా ధరలను ప్రకటిస్తాయి.
నేటి ప్రకటనలో ఎలాంటి సవరణలు చేయలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.115.59, డీజిల్ ధర రూ.103.82గా ఉంది. సీఎన్‌జీ ధర కిలోకు రూ.97గా కొనసాగుతోంది.
వివరాలు
ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12, చెన్నైలో రూ.107.77, బెంగళూరులో రూ.110.93, తిరువనంతపురంలో రూ.115.49, నోయిడాలో రూ.102.12, ముంబైలో రూ.111.18, కోల్‌కతాలో రూ.113.47, గుర్గావ్‌లో రూ.102.77, భువనేశ్వర్‌లో రూ.109.92, చండీగఢ్‌లో రూ.98.10, జైపూర్‌లో రూ.112.66, లక్నోలో రూ.102.05, పాట్నాలో రూ.113.35గా నమోదయ్యాయి.
ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ.95.20, ముంబైలో రూ.97.83, కోల్‌కతాలో రూ.99.82, చెన్నైలో రూ.99.55, గుర్గావ్‌లో రూ.95.44, నోయిడాలో రూ.95.56, బెంగళూరులో రూ.98.80, భువనేశ్వర్‌లో రూ.100.92, చండీగఢ్‌లో రూ.86.09, జైపూర్‌లో రూ.97.78, లక్నోలో రూ.95.55, పాట్నాలో రూ.99.36, తిరువనంతపురంలో రూ.104.40గా కొనసాగుతున్నాయి.
వివరాలు
సీఎన్‌జీ ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో సీఎన్‌జీ ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. న్యూఢిల్లీలో కిలో రూ.83.09, ముంబైలో రూ.86, అహ్మదాబాద్‌లో రూ.82.25, గుర్గావ్‌లో రూ.91.70, నోయిడాలో రూ.91.70, బెంగళూరులో రూ.90, జైపూర్‌లో రూ.90.91, చెన్నైలో రూ.91.50, పూణేలో రూ.92.50, కోల్‌కతాలో రూ.93.50, లక్నోలో రూ.95.75గా నమోదయ్యాయి.